New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మధురమే ఈ హృదయం – 1

మధురమే ఈ హృదయం – 1

టకటక తెల్ల కాగితాలు నల్లటి అక్షరాలు అచ్చేసుకొని చకచక తమ జతను చేరి అందమైన అర్ధవంతమైన  ఓ కవర్ పేజి తొడుక్కొని తమని ఇష్టంగా చదువుకునే పాఠకుల కోసం ఓ చోట సమావేశం అయ్యాయి…

 

 

ఇప్పటికీ ఈ బుక్ మార్కెట్ లో పాతికవేల వరకు అమ్ముడైతే ఇప్పుడు పాఠకుల కోసం మరో పదివేలు సిద్ధంగా ఉన్నాయి…

 

 

“మధురమే ఈ హృదయం…” సిరీస్ వారీగా రిలీజ్ అవుతున్న ఈ నవలకి ఇది మూడో సీజన్…

 

 

కానీ ఇది రిలీజ్ అయ్యి సంవత్సరం అయింది. ఆరు నెలలకే రావాల్సిన ఫోర్త్ సీసన్ బుక్ కోసం ఆ రచయిత ఫ్యాన్స్ అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే పబ్లికేషన్స్ వాళ్ళు ఆ వ్యక్తిని కలవడానికి అరునెలల నుండి విఫలయత్నం చేస్తున్నారు…

 

 

ఆ వ్యక్తి డైరెక్ట్ గా వాళ్ళని కలిసింది లేదు. వ్యవహారాలన్ని ఫోన్ లోనే నడిచి స్టోరీ కూడా మెయిల్ ద్వారా పబ్లికేషన్స్ కి పంపేవాళ్ళు…

 

 

ఫ్యాన్స్ నుండి పబ్లికేషన్స్ వాళ్ళకి ప్రెషర్ ఎక్కువయ్యి వేరే రైటర్ చేత ఆ స్టోరీ కంప్లీట్ చేయించడానికి పూనుకుని సీక్రెట్ గా రైటర్స్ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు…

 

 

❤️❤️

 

 

నిండు పౌర్ణమి తన అందం ఎలా ఉందో చూసుకోడానికి ఏమో సరస్సులోకి తొంగి చూస్తూ కమలాలకి జీవం పోస్తోంది ..

నువ్వు చూస్తే మేమేం తక్కువ అని వెన్నల, చుక్కలు కూడా తమ అందాలని అద్దంలా స్వచ్ఛంగా ఉన్న నీటిలోకి తొంగి చూస్తుంటే ఆ దృశ్యాన్ని తన పుస్తకంలోని మాటల్లో పొందికగా భద్రపరుచుకుంటోంది ఓ అమ్మాయి…

 

 

వెనక ఏదో అలికిడి అవుతుంటే అప్పటివరకు రాస్తున్న పుస్తకాన్ని తన ముందున్న టేబుల్ మీద పెట్టేసి పైకి లేచిన ఆమె  తను అప్పటివరకు కూర్చున్న చైర్ లో ఆరేసిన స్కార్ఫ్ తీసుకోబోతుంది…

 

 

ఆ పని చెయ్యనివ్వకుండా ఆపేసిన అతడు తన చేతిలోని బ్లాక్ గిటార్ ని ఆ చైర్ లో పెట్టేసి ఆమెను గట్టిగా హత్తుకుంటాడు…

 

 

పక్కనే వెలుగుతున్న ఓ సెంటెడ్ క్యాండిల్ తన పరిమళాన్ని గాల్లోకి చిన్నగా వదులుతుంటే హత్తుకున్న అతడ్ని తిరిగి హత్తుకొని కాసేపు వీపు నిమిరి చిన్నగా అతడికి దూరం జరిగి ఏమైంది అని మెల్లగా అడుగుతుంది ఆ అమ్మాయి అతడు చైర్ లో పెట్టిన గిటార్ చేతిలోకి తీసుకుంటూ…

 

 

తిరిగి చైర్ లో కూర్చుకుంటూ గిటార్ మీద అందంగా చెక్కున్న MS అక్షరాలని  ప్రేమగా తడుముతున్న ఆమెకు గిటార్ పెట్టుకున్న చోట డ్రెస్ కాస్త తడిగా ఆనిపించి చూసింది…

 

 

ఎర్రగా బొట్లు బొట్లు కారుతున్న రక్తం తన డ్రెస్ ని తడిపేస్తుంటే ఆ రక్తాన్ని చూసి చిన్నగా కళ్ళు తిరగడం మొదలవుతుంది ఆమెకు…

 

 

కాస్త తమాయించుకున్న ఆమె కంగారుగా పైకి లేచి నీకేం కాలేదుగా అని అతడ్ని మొత్తం తడిమి చూస్తుంది…

 

 

ఆమె కళ్ళల్లో అతడి కోసం నిలిచిన నీటికి ఇష్టంగా ఆమెను హత్తుకొని నాకేం కాలేదు కూల్ అంటాడు…

 

 

మరి ఆ బ్లడ్ అని వణుకుతున్న చేత్తో బ్లడ్ వైపు చూపిస్తున్న తన చేయి పట్టి అతడు తన చుట్టూ వేయించుకొని నీకది అవసరం లేని విషయం అంటాడు గంభీరంగా…

 

 

అతడ్ని మళ్ళీ తిరిగి ప్రశ్నించే ధైర్యం ఉన్నా ఆ ఉద్దేశం లేని ఆమె ఇంకెం మాట్లాడదు…

 

 

కాసేపు ఒకరి కౌగిట్లో ఒకరు సేదతీరాక ఆమెని దూరం జరిపిన అతడు ఏం రాసావ్ అని బుక్ ని చేతిలోకి తీసుకొని చూస్తాడు…

 

 

ముత్యాల్లాంటి అక్షరాల్లో అందంగా పొదిగిన అక్షరాల వెంట తన కళ్ళని పరిగెత్తిస్తున్న అతడు ఆమె రాసుకున్న ఫాంటసీలకు నవ్వుకుంటాడు…

 

 

ఎందుకు నవ్వుతున్నావ్? బుంగ మూతి పెట్టి ఆడుగుతున్న తనని చూసి ఏంటి ఇది అని అడుగుతాడు తను రాసింది ఆమెకే చూపిస్తూ…

 

 

ఆమె రాసిన దానికంటే అతడు దాన్ని చదివి వెక్కిరిస్తున్నందుకే ఆమె మొహం ఎర్రగా కందిపోతుంటే ఇప్పుడు ఈ ఫాంటసీ నిజం చేద్దామా అంటాడు అతడు…

 

 

ఆమ్మో! వద్దని ఆమె అతడి నుండి దూరంగా పరిగెడుతుంటే ఆమెను పట్టుకోడానికి వెనకే వేగంగా అడుగులు వేస్తాడు అతడు…

 

 

సిద్… నో అని ఆయాసంగా అంటున్న ఆమెని పట్టుకోడానికి ముందుకు అడుగేసేలోపు ఆమె కళ్ళు పెద్దవి అయితే తలపట్టుకొని వెనక్కి తిరుగుతాడు అతడు…

 

 

ఓ రూపం వికృతంగా నవ్వుతూ అతడినే చూస్తుంటే కంగారుగా ఆమె వైపు చూసిన అతడు ఆమెను చేరేలోపే ఆమె వెన్నులో కత్తి దింపి పక్కనున్న రాయి మీదకి తోస్తాడు…

 

 

బలంగా తగిలిన రాయికి ఆమెకి తల నుండి నెత్తురు చిమ్మి అతడి కోసం చెయ్యి చాస్తున్న ఆమెని కన్నీళ్ళతో చూస్తూ “మోషితా…” అని గట్టిగా అరిచి ఓ నాలుగు బుల్లెట్స్ అతడి శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోతాడు…

 

 

అతడు పూర్తిగా కళ్ళు మూసేలోపు సిద్ కళ్ళ ముందే మెషితాని తన కాలితో నీటిలోకి తోసేసిన ఆ వ్యక్తి రాక్షసంగా నవ్వుకుంటూ అక్కడనుండి వెళ్ళిపోతే తననే అనుసరిస్తారు అతడి అనుచరులు…

 

 

బయట కుమ్మరిస్తున్న వర్షం అయినా లోపల ఫుల్ ఏసీ ఉన్నా కూడా చమటతో తడిసిపోతున్న  అతడు మోషితా అని ఉలిక్కిపాటుగా నిద్ర లేస్తాడు…

 

 

తన బెడ్ ఎదురుగా ఉన్న మూడు అడుగుల ఆమె పెయింటింగ్, నవ్వుతున్న ఆమె రూపం ఆమె ఇంకా ఎక్కడో సజీవంగా ఉందని అతడి మనసు చెప్తుంటే ఎప్పటిలానే నిర్లిప్తత నిండిన మనసుతో తన రోజును ప్రారంభిస్తాడు…

 

 

అతడు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆగకుండా మొగుతున్న తన మొబైల్ ని విసుగ్గా చూస్తూ లిఫ్ట్ చేసిన అతడికి అవతల వాళ్ళు చెప్పుంది విని టెంపర్ మీటర్ పెరిగిపోతుంది…

 

 

ఈ మధుర ప్రయాణం సశేషం…❤️

 

 

అందరిస్తారని కోరుతూ…