ఆ ఇడియట్ తో పాటు మీరు కూడా వెళ్ళండి. ఐ నీడ్ స్పేస్.. అంటూ అరిచి చెప్పిన మేఘ డోర్ ఓపెన్ చేయలేదు.
మోహాలు చూసుకుని బాధపడుతున్న జీతేంద్ర ఇంకా రూపా గారి ని మరొక రూమ్ కి తీసుకువెళ్లి రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అని చెప్పారు కదా, మీరు ఇక దేనికి టెన్షన్ పడకండి మావయ్య.
వాడు మళ్ళీ మేఘ ను డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను అని అరిచేతులు బిగించి శపథం చేసిన రిత్విక్ వాళ్లకి ఊరట కలిగించి స్టేషన్ కి ఫోన్ చేశాడు.