కొత్త పెళ్లి కొడుకువి నీకు ఈ పనులన్నీ అవసరమా నేను చేసుకుంటాను కదా అని భరత్ వారిస్తున్నా సరే ఎన్ని పనులని ఒక్కడే చేసుకుంటావు బావ..
కొత్త పెళ్లి కొడుకు అయితే మాత్రం పనులు చేయకూడదా ఏంటి? పెళ్ళి నాది పనులు నీవా.. మన ఇంట్లో పనులు మనం చేసుకోవడానికి కొత్త పెళ్లికొడుకు ఏంటి పాత పెళ్ళికొడుకు ఏంటి ఏమి కాదు కానీ అంటు ఇంట్లో సరుకులు అన్ని సర్దడంలో హెల్ప్ చేస్తాడు ప్రణయ్..
అతను అలా చెప్పేసరికి భరత్ కూడా ఇంకేం చెప్పలేక ఇంట్లోనే కదా బయటకి ఎక్కడికి వెళ్లట్లేదు కదా ఏం కాదులే అని పనిలో నిమగ్నం అయిపోతాడు..
ఇక్కడ వీళ్ళిద్దరూ ఈ పనిలో ఉండగా యశోద, భాను , ప్రతిమ ముగ్గురు వంటింట్లో మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లలో వుంటారు..
ప్రతిమ కి ఆ కట్టెల పొయ్యి మీద వంట చేయడం రాదు కానీ భాను యశోద గారు చేస్తూ ఉంటే, వాళ్లకి కావలసినవి అందిస్తూ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది ప్రతిమ..
అలా అలా అందరూ కలిసి మధ్యాహ్నం భోజనాలు కూడా పూర్తి చేసేసి కాసేపల విశ్రాంతి తీసుకుంటారు..