వైజాగ్ విల్లాలో వాతావరణం నిప్పులు చెరుగుతోంది. ఇషాంత్ తన కోటు సర్దుకుంటూ, చేతిలో ఉన్న ఫైల్‌ని విసిరి కొట్టాడు.
తన కళ్ల ముందు మైరా ఫోటో ఉంది, ఆమె వివరాలన్నీ దిలీప్ సేకరించాడు. కానీ సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి ఒక అత్యవసర కాల్ వచ్చింది.
ఒక మల్టీనేషనల్ డీల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉంది, ఇషాంత్ స్వయంగా వెళ్తే తప్ప అది సాధ్యం కాదు.
దిలీప్! కారు తీయ్.. ఎయిర్‌పోర్ట్‌కి పద అని గర్జించాడు ఇషాంత్.సర్ మరి ఆ అమ్మాయి మైరా ఆమె కాలేజీకి వెళ్దామన్నారు కదా అని దిలీప్ భయం భయంగా అడిగాడు.
ఇషాంత్ ఒక్క క్షణం ఆగి ఆ ఫోటో వైపు చూశాడు. అతని కళ్ళలో పగ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె నా గుప్పిట్లోనే ఉంది దిలీప్.
ప్రస్తుతానికి ఈ బిజినెస్ ముఖ్యం. కానీ గుర్తుంచుకో.. భూపతి రాజు దేన్నైనా మర్చిపోతాడేమో కానీ, తనని అవమానించిన ముఖాన్ని మాత్రం వదలడు.