New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 3

ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 3

 

 

 

 

 

 

🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ 03

(The Destiny of Love )🌸🕊️

 

క్షణం ఆలస్యం చేయకుండా.. ”  ఓం నమః శివాయ..! ” అంటూ.. నడుస్తున్న కాలాన్ని అక్కడే ఆపివేస్తుంది…యషిక 

 

చుట్టూ వున్నా కాలం అక్కడే స్థాభించి పోయినట్టు అయిపోతే.. యషిక.. పరుగున ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి.. ఆ లారీ వెళ్లే మార్గం నుండి అతడిని తప్పిస్తుంది…..

 

అతడి నుదుటి మీద వున్నా.. ఆయుః రేఖలని అలానే చూస్తూ వుండిపోతుంది….

 

ఆ లారీ వెళ్లే దిశని తను ఏమాత్రం మార్చకుండా.. తన చేతుల్లో వున్నా అతనిని అతని తల మీద  వున్నా పూలబుట్టతో సహా  పక్కకి జరిపి..

 

జారిపోతున్న ఆ పూల బుట్టని తను పట్టుకున్నట్టుగా.. స్థాభించిన ఆ కాలాన్ని.. అలా మార్చేసి.. చుట్టూ ఒకసారి చూసి అన్ని సరిగ్గానే వున్నాయ్ అని అనుకున్నాక 

 

మళ్ళీ ఒకసారి.. ఓం నమః శివాయ..!! అని అంటుంది.. వెంటనే కాలం యాదవిధిగా తన తిరోగమనం.. మొదలు పెట్టగానే..

 

అతడు పడిపోతున్న తన పూలబుట్టని పట్టుకొంటూ.. యషిక ని చూసి.. యషి తల్లి అని అంటాడు ఆప్యాయంగా..

 

యషిక.. నాలుగు పదులు దాటి.. ఐదు పదులకి దగ్గరగా వున్నా అతడిని చూసి.. హ.. బాబాయ్ అని అంటుంది చిరునవ్వుతో చూస్తూ.. నిశ్చాలమైన ముఖంతో 

 

అతడు.. పడిపోబోతున్న పూల బుట్టని సరిగ్గా పట్టుకుంటూనే ఆ బుట్టలో వున్నా ఒక కమలం పువ్వుని తీసి యషికి ఇస్తూ.. నీ శివయ్య దర్శనం బాగా జరిగిందా తల్లి అని అడుగుతారు..అంతే ఆప్యాయంగా..

 

యాషి.. అతన్ని చూస్తూ.. హ బాబాయ్ అని అంటూ.. అతడు ఇచ్చిన ఆ కమలం పువ్వుని  తీసుకుంటూనే.. తన చేతి స్పర్శతో  తన ఆయుష్షులోని కొంత భాగం అతడికి ధారా పోస్తుంది..చిరు నవ్వుతోనే..

 

అతడి  నుదుటిని చుసిన క్షణమే..  ఆమెకి అర్ధం అయిపొయింది.. ఆ కాలుడు..  అకాల మృత్యువు రూపంలో అతన్ని ఈ రోజు కబలించబోతున్నాడు అని.. 

 

ఇద్దరు ఆడపిల్లలు ఇంకా తన భార్యతో నిజాయితీగా బ్రతుకుతూ…. ఆ శివయ్యనే ఆరాధించే అతను ఆమెకి సూపరిచితమే..

 

  ప్రేమగా.. ఆప్యాయంగా తల్లి అని.. తనని నోరారా పిలిచే .. అతడికీ.. ఆ తల్లిలానే  తన ఆయుష్షుని ధారా పోసింది.. యషిక ఏమాత్రం ఆలోచించ కుండా..

 

యషి చేతి స్పర్శతో ఏదో తెలియని శక్తి తనలోకి చేరడంతో.. నిన్నటి నుండి తెలియని దిగులుని మోస్తున్న అతడు.. యషిని చూసి చిరునవ్వు నవ్వుతూ..

 

నిన్ను చుస్తే.. చాలు తల్లి..  సాక్షాత్తు ఆ శివయ్యని ఆ జగన్మాతా సామెతంగా దర్శించుకున్నట్టుగా అనిపిస్తుంది  అని అంటూ… 

 

నిన్నటి నుండి తెలియని గుబులుతో మనసంతా భారంగా అనిపించింది తల్లి..ఇప్పుడు నిన్ను చూసాక.. మనసులో ఆ గుబులు పోయి.. ప్రశాంతంగా  వుంది అని అనడంతో..

 

యషి అతన్ని చిరునవ్వుతో చూసి.. ఆ శివయ్య మనకి తోడుగా ఉండగా.. మనకి  ఎలాంటి దిగులు వద్దు బాబాయ్ అని అంటూ.. 

 

తన చేతికి వున్నా రుద్రాక్ష మాలా నుండి.. ఒక రుద్రాక్ష నీ అతనికి ఇస్తూ..  బాబాయ్ మీరు.. ఈ ఏక ముఖి రుద్రాక్షని ధరించండి.. అలాగే.. ఈ రోజు ఎక్కువగా దైవ నామస్మరణ చేయండి..

 

ఎలాంటి భయం కూడా మిమ్మల్ని వెంబడించదు అని చెప్పి.. అక్కడి నుండి వెళ్ళిపోతుంది.. యషి 

 

వెళ్తున్న యషినే చూస్తూ ఉంటాడు అతడు..  కానీ అతనే కాకా మరో రెండు ఎర్రని నిప్పుని తలిపించే కళ్ళు యషిని   చూస్తూ రాక్షసంగా నవ్వుతాయి..ఆ క్షణం..

 

యషిక.. చేతికి వున్నా ఆ రుద్రాక్షలె ఆమె ఆయుష్షుకి చిహ్నలు..  కాగా.. ఆమె వయసు పాతికెళ్ళు దాటాగానే.. ఆమెని మృత్యువు కబలించబోతుంది.. అని యషికి తెలుసు.. అలాగే ఆమె సంపూర్ణ ఆయుష్షు కలది కూడా..

 

తన జీవితం మీద  ఎలాంటి ఆశలేని యషి అనునిత్యం ఆ శివయ్య నామ స్మరణలో.. ఆ శివయ్య ఇచ్చిన భాద్యతని నిర్వర్తిస్తుంది.. 

 

తన ఆయుష్షుని   అకారణంగా  మృత్యువు ఒడి లోకి వెళ్తున్న వాళ్ళకి అందిస్తూ.. తన ఆయుష్షుని తగ్గించుకుంటుంది..యషిక..

 

ఇప్పుడు కూడా తన జీవితంలో ఒక సంవత్సరా కాలాన్ని అతడికి ఇచ్చేసి అదే చిరు నవ్వుతో వెళ్తున్న ఆమెని చూస్తూ.. ఉంటుంది.. ఆమెని వెంటబోయే ఆమె కోసమే ఎదురు చూస్తున్న ఆమె మృత్యువు…

 

@@@

 

మరో చోట…

 

సరయు నది… సమీపంలో ఉదయం మబ్బులు ఇంకా పూర్తిగా తొలగిపోని వేళ… నింగిలోని  చుక్కలు నీలి ఆకాశంలో ఇంకా మెము వున్నాము అన్నట్టుగా తొంగి తొంగి చూస్తుంటే…

 

ఆ సరయు.. నది ఒడ్డున వున్నా.. ఆ అయోధ్య రామజన్మ భూమిలో.. అక్కడ వున్నా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ…

 

ఆ రాముని ఆలయంలోని ప్రధాన గంట ఒక్కసారిగా మారు మోగుతుంది… ఎవరి రాకనో పసిగట్టినట్టుగా…

 

అప్పుడే ఆ ఆలయ మెట్ల మీద నెమ్మదిగా కనిపిస్తుంది ఒక నీడ.. ఆ రాముడే  మళ్ళీ ఈ అవనిని   చేరడా అన్నట్టుగా వున్నా.. ఒక ఆజానుబహుడు  పట్టు పంచలో మేడలో కండువా ఒక్కటే ధరించి..   శ్రీ రామ తారక మంత్రాన్ని అతడి మనసు మననం చేసుకుంటూ వుంటే..

 

“శ్రీ రామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం

రామ నామ వరాననే”

 

అని మౌనంగా పలుకుతాయి అతడి పెదవులు…

 

* * * * * * * * * * * * * * * * * * * * * * 

 

𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️