ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 2
🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ -02
(𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎)🌸🕊️
ఆ నీలి నింగిలోనూ.. నీలకంఠుడు అయినా శివుణ్ణి దర్శనం చేసుకున్నాక.. తన నానమ్మని చూస్తుంది…ఆమె..
తన నానమ్మ అయినా అనసూయమ్మగారు.. ఆమెని చూస్తూ.. కన్నా అని పిలుస్తారు… ప్రేమ నిండిన స్వరంతో..
నానమ్మ పిలుపుకి.. వెనక్కి తిరిగిన ఆమెను చల్లని పిల్లగాలి ప్రియంగా స్పర్శిస్తుంటే తన బుట్టకమ్మలు చిన్నగా అటు ఇటు కదులుతుండాగా.. అనసూయమ్మ గారి వైపు చూస్తూ.. ఏంటి నాని అని పిలుస్తుంది తన తియ్యనీ కోకిల స్వరంతో…
అనసూయమ్మ గారు.. ఆమెలానే కిటికీలో నుండి.. బయట కనిపిస్తున్న ఆకాశంలోకి చూస్తూ.. తెల్లవారేలా ఉంది.. కదా కన్నమ్మ ఇక బయలుదేరుదామా అని అడుగుతారు..
ఆమె.. తన నానమ్మని అనుమానంగా చూస్తూ..
బయలుదేరుదామా నా!!?..
అంటే నువ్వు కూడా వస్తున్నావా.. నువ్వు ఎక్కడికి రావడం లేదు.. నానీ నువ్వు ఇక్కడే ఉండు.. రోజులానే నేను మాత్రమే వెళ్తాను అని అంటుంది.. స్థిరంగా..
ఆమె మాటలకి తన నానమ్మ అలుక మొహం వేస్తె అనసూయమ్మ గారిని చూస్తూనే వున్నా ఆమె..
ఓహ్ మై క్యూట్ డార్లింగ్.. నువ్వు ఇలా బుంగమూతి పెట్టుకున్నంత మాత్రాన నిన్ను నేను నాతో తీసుకొని వేళ్ళను బేబీ.. బయట చాలా చలిగా వుంది కదా..
ఈ చలిలో నువ్వు వద్దు బుజ్జులు.. నేను మాత్రమే వెళ్తాను.. హా! అక్కడ వాళ్ళు నీ గురించి అడిగితే నేనే వద్దు అన్నాను అని చెప్తానులె అని అంటూ.. తన నానమ్మని బుజ్జగించి…
తల్లికి జాగ్రత్తలు చెప్పి… తన తండ్రి ఇంకా తాతయ్య ఇద్దరు నిద్రలేవగానే వాళ్ళకి కావాల్సినవి చూసుకోమని చెప్తూనే ….
ముడి వేసిన తన జుట్టుని చక్కగా లతలా అల్లుకొని.. సన్నజాజులని ఆమె కురుల అందం పెంచేలా.. నాలుగు వరుసలు తన జడలో తుడిమాకా…
తల్లికి నానమ్మకి మరోసారి తను వెళ్తున్నట్టుగా చెప్పి.. తన గమ్యానికి బయలుదేరుతుంది…
పావు గంట తరువాత తను అనుకున్న గమ్యం చేరగానే.. ఎదురుగా కనిపిస్తున్న గోపురాన్ని దర్శించుకొని..
” ఓం నమః శివాయ..!! ” అని మననం చేసుకున్నా తరువాత.. తన కోసమే ఎదురు చూస్తున్న ఆ శివయ్యకి.. సేవకురాలిగా.. ఆ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అడుగు పెడుతుంది…
ఆమె.. పాద స్పర్శకె.. పులకరించినట్టుగా.. ఆ గుడి గంటలు.. చక్కగా శబ్దం చేస్తుంటే.. ఆ శివయ్య అభిషేకం కోసం తెచ్చిన పువ్వులు…. గాలికి ఎగురుతూ శివయ్య పాదాలని కొన్ని తాకి.. ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఎదురువేళ్తాయి….
ఎప్పటినుండో ఆమె కోసమే ఎదురు చూస్తున్న పెద్ద పూజారిగారు.. అమ్మ యషిక అని పిలవడంతో…
కన్నులనిండా శివయ్యని నింపుకుంటూనే హ! పంతులు గారు అని అంటూ.. పెద్ద పూజారిగారి వంక కూడా ఒకసారి చూసి.. శివయ్యకి నమస్కారం చేసుకొని.. పెద్ద పూజారి పాదాలకి కూడా నమస్కారం చేస్తుంది…యషిక
పెద్ద పూజారి గారు… దిర్ఘాయుష్మాన్ భవ..!!
అని ఆశీర్వచనాలు ఇస్తుంటే.. చిరునవ్వుతో.. ఆయన్ని చూస్తూ…
ఆయుష్షు లేని నాకు.. దీర్ఘాయుషా అని మనసులో అనుకుంటూ… అందంగా అలంకరించిన శివలింగాన్ని చూస్తూనే..
ఆ శివయ్యకి ఎదురుగా కూర్చుంటుంది… యషిక…
పెద్ద పూజారి గారు.. యషికని చూస్తూ.. ఇతరుల ఆయుష్షు పెంచే నీకు.. ఆ శివయ్య ఎప్పుడు కూడా సంపూర్ణ ఆయుష్షునే కానుకగా ఇస్తాడు తల్లి అని అంటారు.. తెలికైనా మనసుతో నమ్మకంగా….
యషిక.. చిన్న నవ్వుతో పూజారి గారిని చూస్తూ… ఆ తండ్రి ఇచ్చే కానుక కన్నా.. ఆ తండ్రి నాకై ఇచ్చిన భాద్యతనే నా కళ్ళ ముందు ఎప్పుడు ఉంటుంది అని.. తన కనులను నెమ్మదిగా మూసుకొని.. తన మనోనేత్రన్ని తెరుస్తూ.. ఆ త్రినేత్రుని నిజరూప కైలాస దర్శనం చేసుకుంటుంది…
క్రమేణా తన స్వరం పెంచుతూ.. ఆ శివయ్య కాలభైరవ రూపానికి పరవశురాలు అవుతూనే…
ఏక కంఠంతో.. ఆ ఆది శంకర చార్యులు రాసిన ఆ కాలభైరవ అష్టకాన్ని జపిస్తుంది… పరవశనీయంగా!
దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాల యజ్ఞసూత్ర మిందుశేఖరం కృపాకరమ్!
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం
నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్!
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
శూలటంక పాశదండ పాణి మాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్!
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
భుక్తిముక్తి దాయకం ప్రశాస్త చారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహమ్!
నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్!
స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్!
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర మోక్షణం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్!
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాస లోక పుణ్యపాప శోధకం విభుమ్!
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికా పురాధినాథ కాలభైరవం భజే!!
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనమ్!
శోకమోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్!!
ఒళ్ళు గగర్పరిచేలా.. రోమాలు నిక్కబుడిచేలా.. వినిపిస్తున్నా ఆ కాలభైరవ అష్టకం.. కాలాన్ని శాశించే.. యషిక నోటి నుండి వింటూంటే మైమరచి పోతారు పూజారిగారు..
యషిక.. అష్టకం పాటించాక.. శివ పంచాంక్షారీ బీజ మంత్రం కూడా జపించి.. పూర్తిగా తెలవారుతుంది అనగా.. మరొక్క సారి శివయ్యకి నమస్కారం చేసుకొని…
పూజారి గారు ఇచ్చిన.. పూలని.. ప్రసాదంని తీసుకొని.. ఇంటికి బయలుదేరుతుంది…
గుడి ఆవారణాన్ని దాటినా యషిక చుట్టూ చూస్తూ ముందుకు వెళ్తుంటే తన ఎదురుగా.. కొంచం దూరంలో..
వేగంగా వస్తున్న ఒక లారీ.. గుడి కోసం పూజ సామాగ్రి తెస్తున్న ఒక వ్యక్తి మీదకి దూసుకు వస్తున్నట్టు అనిపించగానే…
క్షణం ఆలస్యం చేయకుండా.. ” ఓం నమః శివాయ..! ” అంటూ.. నడుస్తున్న కాలాన్ని అక్కడే ఆపివేస్తుంది…యషిక
చుట్టూ వున్నా కాలం అక్కడే స్థాభించి పోయినట్టు అయిపోతే.. యషిక.. పరుగున ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి.. ఆ లారీ వెళ్లే మార్గం నుండి అతడిని తప్పిస్తుంది…..
అతడి నుదుటి మీద వున్నా.. ఆయుః రేఖలని అలానే చూస్తూ వుండిపోతుంది….!!!!
* * * * * * * * * * * * * * * * * * * * * *
𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️
Swipe left/right or tap the sides to turn pages