విజయం మీ వెంటే వస్తుంది అని స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తుంటే,దేవి గారు స్టేజ్ కింద కూర్చుని తన కొడుకుని చూసి గర్వపడుతోంది.
రణ్వీర్ కి తెలుసు, తన తల్లి నవ్వు కోసం తాను ఏ యుద్ధానికైనా వెళ్తాడు, కానీ ఆ యుద్ధం నీడ కూడా తన ఇంటి మీద పడకుండా చూసుకుంటాడు.
***************
అనిత కాలేజీ ఫంక్షన్ ముగిసింది. రణ్వీర్ సామ్రాట్ తన కుటుంబంతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. బయట ప్రపంచానికి అతను ఒక గంభీరమైన బిజినెస్ మాన్ కావచ్చు,
కానీ ఈ సామ్రాట్ మెన్షన్ నాలుగు గోడల మధ్య అతను కేవలం దేవి గారి ముద్దుల కొడుకు, అనిత, రాహుల్‌ల అన్నయ్య మాత్రమే.
అన్నా ఈరోజు నువ్వు ఇచ్చిన స్పీచ్ అదరహో…. నా ఫ్రెండ్స్ అందరూ నీ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతున్నారు తెలుసా,అని అనిత సోఫాలో వాలుతూ ఉత్సాహంగా అంది.