ప్యాలెస్‌లో కాలం నెమ్మదిగా కదులుతోంది. అమ్మవారి పూజ తర్వాత ఇంట్లో ఒక తెలియని ప్రశాంతత రాజ్యమేలుతోంది.
రోజులు గడుస్తున్నాయి.. అన్విక తన కాలేజీ చదువులో, రణ్వీర్ తన వ్యాపార సామ్రాజ్యంలో బిజీ అయిపోయారు.
కానీ, రణ్వీర్ మనసులో మాత్రం అన్విక మీద ప్రేమ రోజురోజుకూ బలపడుతోంది.
అన్విక కూడా రణ్వీర్ తన పట్ల చూపిస్తున్న గౌరవానికి, రక్షణకు ముగ్ధురాలై అతనితో చాలా చనువుగా ఉండటం మొదలుపెట్టింది.
ఒకరోజు మధ్యాహ్నం రణ్వీర్ ఆఫీస్‌లో ఉండగా లండన్ నుండి ఒక అత్యవసర కాల్ వచ్చింది.
వారి అంతర్జాతీయ ప్రాజెక్టులో ఏదో పెద్ద సమస్య తలెత్తిందని, రణ్వీర్ స్వయంగా వెళ్తే తప్ప అది పరిష్కారం కాదని సిద్ధార్థ్ చెప్పాడు.