రణ్వీర్ లండన్ వెళ్ళి పది రోజులు గడిచిపోయాయి. అన్విక తన ఎగ్జామ్స్ పూర్తి చేసింది.
రణ్వీర్ లేని ప్రతి క్షణం ఆమెకు ఒక యుగంలా అనిపిస్తోంది. ప్రతిరోజూ ఫోన్లో ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నా,
రణ్వీర్ నుండి త్వరలోనే వస్తాను పాపా అనే పొడిపొడి సమాధానమే వస్తోంది.
ఒకరోజు సడన్ గా రణ్వీర్ నుండి ఫోన్ రావడం ఆగిపోయింది. అన్విక ఎన్నిసార్లు డయల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది.
అన్విక మనసు కీడు శంకించింది. గదిలో పచార్లు చేస్తూ, కళ్లలో నీళ్లతో దేవి గారి దగ్గరకు పరిగెత్తింది.
అత్తమ్మా! రణ్వీర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆయనకు ఏమై ఉంటుంది అని ఏడ్చేసింది.