సామ్రాట్ ప్యాలెస్‌లో గాలి కూడా బరువుగా అనిపిస్తోంది. అన్వికకు జ్వరం తగ్గింది కానీ, మనసులో ఉన్న బెంగ మాత్రం తగ్గలేదు.
రణ్వీర్ రాక కోసం ఆమె కళ్లు వాకిలి వైపు చూసి చూసి అలసిపోయాయి. తన భర్త తనను మర్చిపోయాడా? లేక తనంటే ఇష్టం లేదా? అన్న సందేహాలు ఆమెను పీడిస్తున్నాయి.
దేవి గారు అన్విక పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయారు. తన కోడలు పిల్లకు జ్వరం వచ్చి, నీరసించి పోయినా రణ్వీర్ ఇంకా రెండు రోజులు అంటూ కాలక్షేపం చేయడం ఆమెకు నచ్చలేదు.
వెంటనే రణ్వీర్‌కు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే రణ్వీర్ ఏమీ మాట్లాడకముందే దేవి గారు విరుచుకుపడ్డారు.
రన్వీర్ అసలు నీ మనసులో ఏముందిరా, పది రోజులకు వెళ్ళినవాడివి నెల రోజులు దాటినా రాకపోవడమేంటి.
అన్వికకు జ్వరం వచ్చింది, నీ మీద బెంగతో ఆ పిల్ల అన్నం నీళ్లు మానేసి శవంలా పడి ఉంది. ఆ పిల్లని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా?