రన్వీర్ ముద్దు నుండి మెల్లగా విడిపడి, రణ్వీర్ ఆమె ముఖమంతా చిన్న చిన్న ముద్దులతో నింపేశాడు.
ఆమె నొసటి మీద, కళ్ల మీద, ముక్కు మీద ముద్దులు పెడుతూ మెల్లగా ఆమె మెడ వైపు సాగాడు. రణ్వీర్ చేతులు అన్విక శరీరం మీద మత్తుగా తిరుగుతున్నాయి.
నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో కేవలం రణ్వీర్, అన్వికల శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది.
రణ్వీర్ తన ముద్దులతో అన్వికను పరవశింపజేస్తున్నాడు.
ఒక నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన భర్తను అంత దగ్గరగా చూసుకున్న అన్విక, తన కోపానంతా మర్చిపోయింది.
రణ్వీర్ గాఢమైన కౌగిలిలో తను ఒక కొత్త లోకంలో విహరిస్తున్నట్లు అనిపించింది.