New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చెలి -1 – 4

నా చెలి -1 – 4

దేవి గారు బయటికి వెళ్ళగానే ధాత్రి ఏడుస్తూ ” నా గురించి ఎంత తప్పుగా అనుకుంటున్నావు అత్తయ్య నేనెందుకు బావ విషయంలో అలా ప్రవర్తిస్తాను మీరు చెప్పినట్టే నేను బావకి దూరంగానే ఉంటాను. నా హద్దులు నాకు తెలుసు అత్తయ్య మీరు ఏమీ కంగారు పడకండి. మీరు కోరుకున్నట్టే బావకి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి నేను మీకు అడ్డు రాను రానే రాను “అని అనుకుని ఏడుస్తూ కళ్ళు మూసుకుంటుంది…..

 

 

దేవి గారు రూమ్ రావడం చూసి ” ఈ టైం లో ఎక్కడికి వెళ్లావు ఇంకా ధాత్రి నీ ఏమైనా తిట్టాల్సినవి  ఉంటే తిట్టి వస్తున్నావా “అని అంటారు కిషోర్ గారు….

 

 

” నాకు ఇంకా వేరే పని ఏమీ లేదనుకున్నారేంటి ఎప్పుడు చూసినా ఆ అమ్మాయిని తిట్టడానికి వాటర్ తాగుదామని వెళ్ళా అంతా అనుమానం ఎందుకు మీకు పడుకోండి రేపు పొద్దున్నే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి మర్చిపోకండి మీరు లేట్ చేస్తే అక్కడ నా కొడుకు ఇబ్బంది పడతాడు “……

 

 

” నీకే కాదు నాకు కూడా కొడుకే నేనేమీ లేట్ చేయను “అని అంటూ పక్కకి తిరిగి నిద్రపోతారు…..

 

 

@@@@@@@@

 

 

ధాత్రి వాళ్ళ అత్తయ్య మాట్లాడిన మాటలు తలుచుకుంటూ నిద్ర కు దూరం అవుతుంది……

 

 

ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసి స్నానం చేసి దేవుడికి దీపం పెడుతుంది. కిషోర్ గారు ఎయిర్పోర్టుకి వెళ్లడం కోసం  రెడీ అయి బయటికి వస్తూ ధాత్రి నీ చూసి ” మీ బావ వస్తున్నాడు రా అందుకే ఎయిర్పోర్టుకి వెళ్తున్నాను “అని అంటారు…..

 

 

ధాత్రి నవ్వి “సరే మావయ్య జాగ్రత్తగా వెళ్ళిరండి “అని అంటూ ఉండగానే దేవి గారు బయటకు వచ్చి ” ఇంకా వెళ్లలేదా అక్కడ వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు మీరు ఇక్కడ ఇలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే అక్కడ వాడు ఇబ్బంది పడతాడు అయినా ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది కదా తీరిగ్గా మాట్లాడుకోవాచ్చు ఇప్పుడైతే వెళ్ళండి “అని ధాత్రి నీ చూస్తూ అంటారు………

 

 

దేవి గారి మాటలకూ విసుగు వచ్చి “ఒక్క నిమిషం ఉంటావా నందు కూడా వస్తా అంది అందుకే వెయిట్ చేస్తున్న అంతేకాని ఇక్కడ ఎవరు ముచ్చట్లు పెట్టుకుని కూర్చోలేదు తెలీకుండా మాట్లాడకు అర్థమైందా ” అని సీరియస్ అవుతారు కిషోర్ గారు…

 

 

” అది కాలేజ్ మాని మీతో వస్తానందా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు “అని అంటూ ఉండగానే నందు బయటకు వచ్చి “వెళ్దామా డాడ్ ఫ్లైట్ వచ్చే టైం అయింది “అని అంటుంది…..

 

 

” నన్ను అడిగే పని లేదా నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావేంటి అసలు నిన్ను కాలేజ్ మాని ఎయిర్పోర్ట్ కి రమ్మని ఎవరు చెప్పారు “అని అరుస్తారు దేవి గారు……

 

 

” మామ్ ఎందుకు అరుస్తున్నావ్ నేను అన్నయ్య కోసమే కదా వెళ్తున్నాను ఒక్కరోజు కాలేజ్ మానితే ఏమీ అయిపోదు నేను డిసైడ్ అయ్యాను అన్నయ్య దగ్గరకు వెళ్ళాలి అని వెళ్తున్నావ్ అంతే నువ్వు ఇప్పుడు ఆపినా నేను ఆగను “అని అంతే సీరియస్ గా సమాధానం చెప్పి ” డాడ్ పదండి వెళ్దాం “అని అంటుంది……

 

 

దేవి గారు కోపం గా ” నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో “అని అంటారు….

 

 

” అదే కదా చేస్తున్నా “…..

 

 

దేవి గారు సీరియస్ గా చూసి రూమ్ లోకి వెళ్ళిపోతే ” హమ్మయ్య ప్రశాంతంగా ఉంది మళ్లీ వచ్చి మామ్ గొడవ చేయకముందే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదండి “అని అంటుంది…..

 

 

“ఓకే ఓకే పదా నందు “అని అంటూ ” సరే తల్లి మేము వెళ్లొస్తాం “అని అంటారు కిషోర్ గారు….

 

 

“సరే మావయ్య “అని అంటుంది ధాత్రి…..

 

 

“వదిన బాయ్ “అని ఇద్దరు బయటకు వచ్చేస్తారు….

 

 

కిషోర్ గారు వాళ్ళు బయటికి వెళ్ళగానే ధాత్రి కిచెన్ లోకి వెళ్లి రాత్రి వాళ్ళ అత్తయ్య మాట్లాడిన మాటలు తలుచుకుని “నా వల్ల మీకు ఇబ్బంది రాకుండా నా జాగ్రత్తలో నేను ఉంటాను అత్తయ్య, బావతో మాట్లాడడం  చేయను “అని బాధపడుతూ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది……..

 

 

@@@@@@

 

 

కిషోర్ గారు కార్ లో వెళ్తూ ” నందు ఎందుకు మీ అమ్మ మాటకు ఎదురు చెప్పి తన కోపానికి గురవుతున్నావ్ నీకు తెలుసు కదా మీ మామ్ కోపం ఎలా ఉంటుందో, ధాత్రి పరిస్థితి చూస్తున్నావు కదా “అని అంటారు……

 

 

” డాడ్ మీరు కంగారు పడకండి అమ్మ ఎప్పుడు అలానే మాట్లాడుతుంది నేను తనకి సమాధానం అలానే చెప్తూ ఉంటాను లేదంటే వదిన నీ ఆడించినట్టు నన్ను ఆడిస్తుంది. అయినా మామ్ కి వదిన తో ప్రాబ్లం ఏంటి డాడీ ఎప్పుడు చూసిన తనని తిడుతూ కొడుతూ ఉంటుంది పాపం  జాలి లేదా వదిన నీ చూస్తుంటే “……

 

 

” జాలి ఉంటే ధాత్రి కి ఇన్ని బాధలు ఎందుకు నందు “……

 

 

” మామ్ కి వదిన అంటే ఎందుకు కోపం “……

 

 

” మీ మామ్ బాగా రిచ్ కదా పైగా ధాత్రి కి అమ్మానాన్న ఎవరూ లేరు ఆస్తి లేదు అందుకే ధాత్రి అంటే మీ మామ్ కి చిన్న చూపు, డబ్బు ఉంటేనే మీ మామ్ కి మనుషుల్లా కనిపిస్తారు మిగతా వాళ్ళు అందరూ మనుషుల్లా కనిపించరు అందుకే తనకి ధాత్రి అంటే చిరాకు కోపం, అయినా ఈ విషయాలన్నీ వదిలేసేయ్ దాత్రి జీవితం ఎప్పుడు బాగుపడాలో అప్పుడే బాగుపడుతుంది మనం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేము నందు, కానీ మీ మామ్ ధాత్రిని చాలా బాధపేడుతుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది తనని ఇక్కడ నుండి మీ చిన్నాన్న వాళ్ళ ఇంటికి పంపెద్దామని అనుకుంటున్నా, మీ నానమ్మ యాత్ర లా నుండి వచ్చిన తర్వాత తనతో మాట్లాడి ఈ జైలు నుండి విముక్తి కలిగిస్తాను నువ్వు మాత్రం పొరపాటున కూడా మీ మామ్ కు చెప్పకు ఎందుకంటే నేను నార్మల్గా దాత్రిని ఇక్కడ నుండి పంపిస్తాను అంటే తను చాలా ఘోరంగా మాట్లాడింది “అని దేవి గారు మాట్లాడిన మాటలు నందు కీ చెప్తారు కిషోర్ గారు….

 

 

నందు షాక్ అవుతూ ” మామ్ ఎప్పటికీ మారుతుందో ఏంటో కదా డాడీ మీరు వదిన విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారా అదే చేయండి నేను మామ్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. వదిన హ్యాపీగా ఉండడమే నాకు కావాలి  “అని అంటుంది…

 

 

“హ అవును నందు మీ వదిన కీ అంతా మంచే జరగాలి “అని అంటూ ఉండగానే ఎయిర్పోర్ట్ రావడం తో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు……

 

 

సరిగ్గా పది నిమిషాలకు ఫ్లైట్ ల్యాండ్ అయింది అని అనౌన్స్మెంట్ రాగానే చాలా ఉత్సాహంగా డోర్ వైపే చూస్తూ ఉంటారు కిషోర్ గారు, నందు……

 

 

” ఏంటి డాడీ అందరూ వస్తున్నారు అన్నయ్య  మాత్రం రావడం లేదు బహుశా ఫ్లైట్ ఏమైనా మిస్ అయి ఉంటాడా మనం వచ్చే ముందు ఒకసారి ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడు ఎలా “అని అంటూ ఉండగానే “బ్లాక్ షర్ట్,టోనడ్ జీన్స్, థిక్ హెయిర్, కళ్ళకి గాగుల్స్” పెట్టుకుని స్టైలిష్ వాక్ తో వస్తున్న హ్యాండ్సమ్ హీరో నీ చూడగానే కిషోర్ గారు, నందు షాక్ గా చూస్తూ ఉంటారు……

 

 

కిషోర్ గారు అలా చూస్తూ ఉంటే పూర్తిగా వాళ్ళ దగ్గరికి వచ్చి ” హాయ్ డాడీ ఎలా ఉన్నారు? నన్ను గుర్తు పట్టలేదా “అని స్మైలీ ఫేస్ తో అంటాడు విధర్వ్ రామ్……

 

 

కిషోర్ గారు తేరుకుని “ఎలా ఉన్నావ్ రామ్ చూసి చాలా రోజులైంది కదా అందుకే అలా చూస్తూ ఉన్న “అని కొడుకుని చూసి హ్యాపీ గా హాగ్ చేసుకుంటారు…..

 

 

ఇద్దరు కాసేపు అలానే ఉండి దూరం జరిగి పక్కనే నోరు తెరిచి చూస్తున్నా నందు నెత్తి మీద ఒకటి వేసి ” ఏంటి అలా నోరు తెరిచావు దోమలు ఈగలు దూరేస్తాయి కొంచెం ఆ నోరు మూసేయ్ ఎవరైనా చూస్తే భయపడతారు  “అని అంటాడు రామ్…..

 

 

నందు తల రుద్దుకుని “అన్నయ్య ” అని గట్టిగా అరిచి  ” నేను నువ్వు అనుకోలేదు అన్నయ్య ఇంత హ్యాండ్సమ్ అయిపోయావ్ ఏంటి ఒక్కసారే హీరో అనుకున్నాను తెలుసా అంత బాగున్నావ్ “అని అంటుంది…..

 

 

” ఎందుకలా అరుస్తున్నావ్ ఇది ఎయిర్పోర్ట్ మన ఇల్లు కాదు పదండి పదండి తొందరగా నేను మామ్ నీ చూడాలి “అని అంటాడు రామ్……

 

 

అప్పటివరకు నవ్వుతూ ఉన్న వాళ్ళు రామ్ మామ్ నీ చూడాలి అని అనగానే ఇంకేం మాట్లాడకుండా బయటికి దారి తీస్తారు……

 

 

” ఇప్పటివరకు లోడా లోడా వాగి సడన్గా సైలెంట్ అయ్యావ్  ఏంటి నందు “అని అంటాడు రామ్….

 

 

“ఎమ్ లేదు అన్నయ్య పదా వెళ్దాం “అని లగేజ్ కూడా పెట్టేసి ఇంటికీ స్టార్ట్ అవుతారు…..

 

 

@@@@@@@

 

 

దేవి గారు అటు ఇటు తిరుగుతూ ” ఏంటి ఇంకా రావడం లేదు వీళ్ళు వెళ్లారా లేదా అక్కడ నా కొడుకు ఇబ్బంది పడుతున్నాడేమో కరెక్ట్ టైం కి వెళ్ళండి అంటే వెళ్ళలేదు “అని కిషోర్ గారిని తిట్టుకుంటూ ఉంటారు…..

 

 

“అత్తయ్య కాఫీ ఇవ్వనా “అని అంటూ వస్తుంది ధాత్రి…….

 

 

” నిన్ను నేను అడిగానా కాఫీ ఇవ్వమని “…..

 

 

“ఆహా అది కాదు తాగుతారేమో అని అడిగాను అంతే “……

 

 

“అవసరం లేదు నువ్వు లోపలికి వెళ్ళు “అని అంటూ ఉండగానే కిషోర్ గారి కార్ లోపలికి వస్తూ ఉండడం చూసి “వచ్చేస్తున్నారు “అని చాలా సంతోషం గా చూస్తూ ఉంటారు దేవి గారు…..

 

 

కార్ దిగి లోపలికి వస్తున్న రామ్ నీ చూసి కిచెన్ లో ఉన్న ధాత్రి దగ్గరికి వచ్చి “ఏయ్ ఎర్ర నీళ్లు రెడీ చెయ్ తొందరగా “అని చెప్పి డోర్ దగ్గరికి వచ్చి లోపలికి వస్తున్న రామ్ నీ చూసి “ఒక్క నిమిషం నాన్న దిష్టి తీస్తాను నా కొడుకు మీద ఎంతమంది దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో “అని అంటారు…..

 

 

“మామ్ ఏంటి నువ్వు దిష్టి అని అంటున్నావ్ ఈ కాలంలో కూడా అలాంటివి పాటిస్తున్నారా “….

 

 

” అలా అనకు నాన్న నీ కోసమే కదా ఈ మామ్ కోసం ఒప్పుకో నాన్న ప్లీజ్ “…..

 

 

“ఓకే మామ్ నీ ఇష్టం “….

 

 

” నా కొడుకు నా మాట ఎప్పుడూ కాదనడు “అని వెనుక ఉన్న నందు నీ చూస్తూ అంటారు…..

 

 

కిషోర్ గారు అసహనం గా ” సరే ఆ దిష్టి ఏదో తొందరగా తీస్తే లోపలికి వస్తామ్ ఎంతసేపు ఇలా బయట నుంచోమంటావ్ “అని అంటారు…..

 

 

“ఒక్క నిమిషం తీసుకువస్తా “అని అంటున్నా దేవి గారిని చూసి ” నువ్వెందుకు ధాత్రి ఉంది కదా తనని తీసుకుని రమ్మను. నువ్వు నీ కొడుకుని చూస్తూ ఉండు “అని అంటారు…..

 

 

ధాత్రి చేత దిష్టి తీయించడం ఇష్టం లేకపోయినా కొడుకు ముందు గొడవ పడడం ఇష్టం లేక కిషోర్ గారిని కోపం గా చూస్తూ “ధాత్రి ఎర్ర నీళ్లు తీసుకురా “అని అరిచి చెప్తారు…

 

 

కిచెన్ డోర్ దగ్గర ఉండి రామ్ నీ చూస్తూ ఉన్న ధాత్రి కీ వాళ్ళ అత్తయ్య అరుపు డీజే సౌండ్ లాగా వినిపించి కంగారు గా ఎర్ర నీళ్లు తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది…..

 

 

ధాత్రి నీ చూస్తూ ” కొత్తగా మెయిడ్ నీ అపాయింట్ చేసావా మామ్ “అని అంటాడు రామ్….

 

 

ఇంకా ఉంది…..