“సరే డాడ్ నేను పిలుస్తా మామ్ నీ “అని నందు రూమ్ వైపు వెళ్తే ” డాడ్ అందరం కలిసి తిందాం అని పిలిచాను అంతే మీరు జోక్స్ వేయకండి “అని తింటూ అంటాడు……
” నేను జోక్స్ వేయడం లేదు రా నువ్వు అన్నమాట కదా చెప్తున్నాను మాటికి ముందు మామ్ వెనుక మామ్ తగిలిస్తున్నవ్ మరి “అని చిరాగ్గా అంటూ బయటికి వస్తున్న దేవి గారిని చూసి మరింత చిరాగ్గా ఫేస్ పెడతారు కిషోర్ గారు…..
“ఏంటి డాడ్ మీకు మామ్ నీ చూస్తుంటే ఆటోమేటిక్ గా మీ ఫేస్ చాలా సీరియస్ అయిపోతుంది ఏమైంది మీకు “అని అంటాడు రామ్…..
“కొంతమంది ఫేస్లు చూస్తే ఆటోమేటిక్ గా చిరాకు వస్తుంది రామ్ ఇక్కడే ఉంటావ్ కదా నీకు తెలుస్తుంది లే నా చిరాకు “…..