పని మనిషి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ వుండగానే ” హేయ్ ఇంకా క్లీన్ చెయ్యడం అవ్వలేదా ” అంటూ పై నుంచి విక్కీ అరుపు వినిపించింది….
వెంటనే ఏడుస్తూ నిలబడి ఉన్న అభి కంగారుగా ఫ్లోర్ మిద ఉన్న చట్నీ క్లీన్ చెయ్యడం స్టార్ట్ చేసింది….అది చూసిన మాధవ్ బాధగా ” నువ్వు క్లీన్ చెయ్యడం ఎంటి సిస్టర్. పని మనిషి ఉంది కాద తను క్లీన్ చేస్తుంది లే…” అని చెప్తాడు…
లేదు అన్నయ్య…!ఆయన నన్నే క్లీన్ చెయ్యమని చెప్పారు…మీరు హాస్పటల్ నుంచి వస్తున్నట్టు ఉన్నారు కదా వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేస్తాం ఈ లోపు ” అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా చట్నీ అది అంత క్లీన్ చేస్తుంది…
మాధవ్ , సాగర్ జాలిగా అభి నీ చూసి విక్కీ మిద కోపంతో పైన ఉన్న అతని రూం లోకి వెళ్తారు…
కార్తీక , మహిత ఏమో ఒక్కసారిగా అభి నీ చూసి వాళ్ళ వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోతారు…
అభి అంతా క్లీన్ చేసి ఒకసారి అక్షర రూం వైపు బాధగా చూసి అక్కడ నుంచి కిచెన్ లోకి వెళ్లి పని మనిషి కి వంటలో హెల్ప్ చేస్తూ ఉంటుంది…