New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 18

మౌనమే ని భాష – 18

బెంగళూరు హోటల్ గదిలో ఆ రాత్రి వంశీకి నిద్ర పట్టలేదు. శ్రావణి డైరీలోని ఆ అక్షరాలు అతని కళ్లముందు కన్నీటి చుక్కల్లా మెరుస్తున్నాయి. 

 

ఆ బావ పెట్టిన హింస, చదువుకోవాలనే ఆమె తపన.. అన్నీ చదివాక అతని గుండె బరువెక్కింది. 

 

ఆ రాత్రికి డైరీ మూసివేసి, ఆమె జ్ఞాపకాలను గుండెల్లో అదిమి పట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు.

 

తర్వాతి పది రోజులు బెంగళూరులో వంశీకి చాలా బిజీగా గడిచాయి. పగలు ఆఫీస్ పనులతో తీరిక లేకుండా ఉన్నా, 

 

రాత్రి అవ్వగానే తన ఏకాంతంలో ఆ డైరీనే తన ప్రపంచం చేసుకున్నాడు. శ్రావణి ఎలాగోలా ఆ అత్తామామల ఒప్పించి తను వెంట్రు ఎలాగైతే పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.

 

కానీ ఇక్కడి నుంచి చదువు ఎలా ముందుకు సాగించాలి ఎలా పై చదువులు చదివి ఉద్యోగం చేసితన కాళ్ల మీద తను నిలబడాలి అనేది శ్రావణి కి అర్థం కాని విషయం గా ఉండిపోయింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue