రాక్షస ప్రేమ -24
మరో కాలేజ్ నుంచి వచ్చిన టీం కెప్టెన్ మనోహర్ రౌద్ర గురించి చాలానే విన్నాడు. అంతకుమించి ఇంతకు ముందు కూడా రౌద్రతో ఆడి ఓడిపోయిన అనుభవం కూడా ఉంది.
అందుకే ఈసారి ఎలాగైనా రౌద్ర మీద గెలిచి కప్పు తన కాలేజీకి తీసుకొని వెళ్లాలి అన్న ఆశ, కాదు పంతంతో బరిలోనికి దిగాడు మనోహర్.
ఇటువైపు మనోహర్ అటువైపు రౌద్ర ఇద్దరు చూపు ఒక సెకండ్ కప్ మీద పడింది. అది ఎవరు తీసుకొని వెళ్తారు అనేది తెలియదు కానీ ఇద్దరి మనసులో మాత్రం నాది నాకే సొంతం అన్న ఫీలింగ్ బలంగా ఉంది..
ఎంపైర్ మ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత రౌద్ర బాల్ ని కిరణ్ టీం వైపు విసిరేసాడు. అలా రెండు వైపులా పోట పోటీగా బాల్స్ వేస్తూ ఉన్నారు.
కానీ పాయింట్స్ మాత్రం రౌద్ర టీం కి ఎక్కువగా వస్తున్నాయి కిరణ్ టీం కి చాలా స్లోగా పాయింట్స్ టేబుల్ జరుగుతుంది.