New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 30

రాక్షసప్రేమ – 30

రాక్షస ప్రేమ -30

 

 

 

తన అత్తయ్య తనకి అలాంటి వార్నింగ్ ఇస్తుంది అని ఊహించని కనకధారా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా వెళుతున్నా కనకమహాలక్ష్మి వైపు చూస్తూ ఉంది. 

 

రెండు అడుగులు ముందుకు వేసిన కనకమహాలక్ష్మి “నన్ను తిట్టుకుంటూ చూసింది చాలు ఇక రా” అని సీరియస్ గా చెప్పటంతో,

నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది ఇలా చేస్తే పెళ్లి ఆగిపోతుంది మా అత్త నన్ను మెచ్చుకుంటుంది అనుకుంటే అలా జరిగే ఛాన్స్ లేకుండా పోయింది. ఎప్పుడు ఆత్త నన్ను తిట్టే పనిలోనే ఉంటుంది. ఒక్కసారి అయినా మంచి పని చేసావ్ అని అంటుంది అనుకుంటే నా పెళ్లయిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా అన్నది లేదు, నన్ను మా అత్త పొగడటం తర్వాత సంగతి ఈ పెళ్లి జరగటం నా అత్తకి అస్సలు ఇష్టం లేదు కదా మరి ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోకూడదు ఇలా చేస్తే పరువు పోతుంది అని అంటుందేంటి..

 

నార్మల్ గా అయితే ఇలాంటివి జరిగితే రచ్చ రంబోలా చేస్తుంది. నా అత్తా గొంతుతోనే ఈ ఫంక్షన్ హాల్ అంతా మారు మ్రోగిపోతుంది అలాంటిది ఎంత కూల్ గా సింపుల్ గా ఎందుకు ఉంది అబ్బా, మరలా తిరిగి నన్నే తిడుతుంది అని ఆలోచనలో పడింది కనకధారా. 

 

ఏం జరిగింది అందరూ రూమ్ వైపు వెళ్లి మాట్లాడుకుంటున్నారు అని మండపంలో ఉన్న అందరూ గుసగుసగా అనుకుంటూనే ఉన్నారు. కానీ వెళ్ళిని వాళ్ళు 10 నిమిషాల్లోనే మరలా తిరిగి రావడం, ఎక్కడ ఎటువంటి ఇది గొడవ జరుగుతున్నట్టుగా కూడా పెద్దగా ఎవరికి అనిపించకపోవడంతో అందరూ మరల నార్మల్గా అయిపోయారు‌.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue