రాక్షస ప్రేమ -31
రౌద్ర అనే శౌర్య క్లియర్ గా చెప్పడంతో విరాజిత కళ్ళు చిన్నవి చేసి నీకు ఎలా పరిచయం అని కన్ను ఎగరేస్తూ అడిగింది విరాజిత..
“అబ్బా అక్క నువ్వు అంతా సాగదీసి అడగాల్సిన అవసరం లేదు. అతను నేను ఇద్దరం ఒకే కాలేజీలో చదువుతున్నాం, అంతకుమించి నేను రౌద్ర అపర్ణ విజయ్ నిఖిల్ అందరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్” అని అన్నది శౌర్య.
“నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఏనా లేకపోతే..!” అని విరాజిత సాగదీసి అడగటంతో,
” అబ్బ చాల్లే అక్క” అని అక్కడినుంచి వెళ్ళిపోయింది శౌర్య.
అతడి చూపుల్లో నీ మీద ఏదో ఇంటెన్షన్ ఉన్నట్లుగా అనిపించింది. అది ప్రేమ అయ్యి మీరు ఇద్దరు పెళ్లి చేసుకుని నువ్వు కూడా ఆ ఇంటికే కోడలిగా వస్తే మన ఇద్దరం తోడికోడలు అక్క చెల్లెలు ఉంటాం కాబట్టి ఇక ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా ఉండొచ్చు అని మనసులో అనుకుంది విరాజిత.