ఏవండీ అది మన అమ్మాయి ఎలా ఉందో ఒక్కసారి కనుక్కుంటారా అడిగింది వసుంధర తరుణ్ వైపు చూస్తూ
వసు ఈ టైంలో ఫోన్ చేయడం కరెక్టేనా విరాట్ ఇంట్లో ఉంటే మళ్లీ అత్తయ్య మావయ్యకి ప్రాబ్లం అవుతుంది. మన అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది. అయినా నీకు నీ తమ్ముడు మీద నమ్మకం లేదేమో నాకు మాత్రం నా బామ్మర్ది మీద పూర్తి నమ్మకం ఉంది వాడు నా కూతుర్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది అన్నాడు తరుణ్ నమ్మకంగా
నాకు వాడి మీద నమ్మకం ఉంది అండి కాకపోతే ఎందుకో భయంగా ఉంది నా చిట్టి తల్లిని చూడకుండా ఎన్ని రోజులు ఎప్పుడు లేనో అయినా పొద్దున్నుంచి ఎందుకు ఎదో కీడు సంకిస్తోంది నా మనసు ఒక్కసారి అమ్మా నాన్న తో మాట్లాడితే ఆ భయం తగ్గుతుంది అని నా ఉద్దేశం అంది వసుంధర