ప్రతిమ కి కూడా తన పుట్టింట్లో తనకి అవసరమైన వస్తువులు ఉండటంతో వాటిని గబగబా ఒక బ్యాగ్ లో సర్దేసుకుంటుంది..
ఆమె బ్యాగ్ సర్దుకుని పిల్లలతో కలిసి బయటికి రాగానే యశోద గారు శేఖర్ శాంతి లకు చెప్పి భాను భరత్ ప్రతిమ ప్రణయ్ లతో వాళ్ళ ఇంటికి వెళ్లడానికి బయలుదేరుతారు..
తన భర్తతో కలిసి ఇంటికి బయలుదేరుతూ ఒకసారి తల్లిని హత్తుకుని బెంగగా తండ్రి వైపు చూస్తూ జాగ్రత్త మా వెళ్లొస్తాను అని చెప్పి తన అత్తింటి వాళ్లతో కలిసి, పుట్టింటి నుండి భారమైన మనసుతో అత్తింటికి బయలుదేరుతుంది ప్రతిమ..
తమ ఒక్కగానొక్క కూతురు తమను వదిలిపెట్టి వెళ్తుంటే బాధగా అనిపిస్తున్న తమ కూతురు తమ అత్తింటి వాళ్లతో ఎంత సంతోషంగా ఉందో ఆ కాసేపటికే అర్థం అవడంతో తమ దిగులుని పక్కకి నెట్టేస్తారు శేఖర్ శాంతి గారు..
ప్రతిమ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ప్రణయ్వా ళ్ళ ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులందరూ కాళ్లు కడుక్కుని నేరుగా ఇంట్లోకి వెళ్లి పోతారు..
తను ఆ ఇంటి నుండి వెళ్లి ఒక్కరోజే అయినా సరే ఎందుకో తెలియదు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని సాంత్వన కలుగుతుంది ప్రతిమకి..