New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 172

మాంగళ్య బంధం – 172

యశోదమ్మ ఇంట్లో బాలకృష్ణుడు తిరుగాడాలి అని నవ్వుతూ దీవించి పక్కకు వెళ్తుంటారు.. ఎందుకో తెలియదు వాళ్ళు నవ్వుతూ అలా ఆశీర్వదిస్తుంటే ప్రతిమ మనసు ఒక్క క్షణం నిజంగానే తను గర్భవతి అయినట్టు  తనకి ఒక పాపో,బాబో పుట్టినట్టు ఊహించుకుంటుంది..

 

క్షణం తర్వాత తను అలా ఊహించుకున్నందుకు తన ఊహకి తనే ఆశ్చర్య పోతుంది.. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను..

 

అంటే నేను నిజంగానే మా బంధాన్ని అంగీకరిస్తున్నానా.. అందుకే వీళ్ళందరూ పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండండి అంటుంటే నేను నాకు పిల్లలు పుట్టినట్టే కలలుగంటున్నాను..

 

దీని అర్థం నేను నా మనసు కూడా అదే కోరుకుంటుంది అనా, లేదంటే వీళ్ళు అలా దీవిస్తున్నారు కనుక ఒక క్షణం నా ఆలోచనలు పక్కకు వెళ్లాయా అని తనని తనే ప్రశ్నించుకుంటూ ఉంటుంది..

 

ప్రతిమ ఆలోచనలు అలా ఉంటే ప్రణయ్ మాత్రం వాళ్ల దీవెనలకి  అలాంటి రోజు మా బంధం లో వస్తుందా? మీ ఆశీర్వాదాలు నిజమవుతాయా, నిజమైతే బాగుండు అందరూ సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు..

 

శాంతి, శేఖర్ దంపతులు..భాను,భరత్ దంపతులు, చివరగా యశోదమ్మ వద్దంటున్న ఆవిడతో కూడా ఆశీర్వాదం ఇప్పించిన తర్వాత  ప్రణయ్ ప్రతిమా ఇద్దరికీ   దిష్టి తీసి హారతి ఇచ్చి పైకి లేపుతారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue