అన్విత చేతిలో ఉన్న పెన్‌డ్రైవ్ వైపు విరాన్ష్ చూస్తూనే ఉన్నాడు. ఎన్నేళ్లుగా తనను వెంటాడుతున్న గతం మళ్లీ తన ముందుకొచ్చింది. కానీ ఈసారి అతని భయం తన కోసం కాదు. తన పక్కనే నిలబడి ఉన్న గాయత్రి కోసం.
గాయత్రి మాత్రం అతని ముఖాన్నే చూస్తోంది. అన్విత ఎవరు, ఆమె దగ్గర ఏం ఉంది అనే దానికంటే విరాన్ష్ కళ్లలో కనిపిస్తున్న ఆందోళనే ఆమెను ఎక్కువగా కలవరపెడుతోంది.
అన్విత నెమ్మదిగా ముందుకు వచ్చింది.
ఇన్ని సంవత్సరాలు నన్ను చూసిన వెంటనే వెళ్లిపోయేవాడివి. ఈరోజు మాత్రం వెళ్లలేకపోతున్నావు.
విరాన్ష్ స్వరం గట్టిగా మారింది.
ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. గాయత్రిని ఇందులోకి లాగకు.
అన్విత గాయత్రి వైపు చూసి చిన్నగా నవ్వింది.
నేను ఆమెను ఇందులోకి లాగలేదు విరాన్ష్. నువ్వే తీసుకొచ్చావు.
గాయత్రి అతని చేతిని పట్టుకుంది.
విరాన్ష్ ఆమె వైపు చూశాడు.
ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను.
అన్విత ఆ మాట విని కాసేపు మౌనంగా నిలబడింది. తర్వాత పెన్‌డ్రైవ్‌ను తన చేతిలో తిప్పుతూ నెమ్మదిగా అంది.