అన్నపూర్ణ గారు లోపలికి వచ్చి అక్షయ్ ని చూసి చిన్న అని పిలిచారు…. హా అమ్మమ్మ దా కూర్చో…. ఇద్దరు పక్కన కూర్చొని ఉన్నారు కామ్ గా….
మధ్యలో అక్షయే కల్పించుకొని…. ఏమైంది అమ్మమ్మ అలా ఉన్నావ్…. ఆ మాట నేను నిన్ను అడగాలి చిన్న బాబు…. నాకేమైంది నేను బానే ఉన్నాను…. ఉహు అసలు అలా లేవు ఇది వరకుల అసలు లేవు….
నేను మన అక్షిత వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న నిన్ను…. ఎందుకో చాలా ముబావంగా ఉంటున్నావ్…. మన అక్షమ్మ వచ్చిన ఆనందం అసలు కనిపించడం లేదు నీలో….
అయ్యో అలాంటిది ఏమి లేదు అమ్మమ్మ…. తను నా అక్షు తను వస్తే నేనెందుకు ఆనందం గా ఉండను…. కాకపోతే అలా వెళ్ళిపోయింది అని చిన్న కోపం అంతే అంతకు మించి ఇంకేమి లేదు అని చెప్పాడు….
హ్మ్ ఇలా చూడు చిన్న తను చిన్నప్పటి నుంచి ఎంత మొండిదో నాకు తెలుసు…. పైగా ఎప్పుడు ఎవరికి తల వంచని తత్త్వం తనది…. అందుకే ఆ రోజు చిన్న గొడవ అయ్యి అలా వెళ్ళిపోయింది అంతే….
నువ్వు ఇంకా దాన్నే పట్టుకొని ఇలానే ఉంటాను అంటే ఎలా చెప్పు….అయ్యో అమ్మమ్మ మరి అంత కోపం లేదులే…. కొన్నిరోజులకి సెట్ అవుతాను నువ్వు ఏమి ఆలోచించకు అని చెప్పి అన్నపూర్ణ గారి భుజం మీద తల పెట్టాడు….