పంతులుగారు, “బాబు విక్రమ్, పాప చెవిలో నువ్వు అనుకున్న పేరు మూడుసార్లు చెప్పి, పాప చేయి పట్టుకొని ఆ ఉంగరంతో ఆ బియ్యంలో మూడు సార్లు పేరు రాయి” అని చెప్పడంతో,
“శ్రీనిక… శ్రీనిక… శ్రీనిక…” అంటూ మూడుసార్లు చెప్పి, ఆ తర్వాత బియ్యంలో పేరు రాయించాడు విక్కీ.
పాప పేరు రాసిన మరుక్షణం వెనుక పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ మీద పాప పేరు డిస్ప్లే అవుతుంటే, వచ్చిన చుట్టాలు అందరూ చప్పట్లు కొట్టి శ్రీనికను ఆశీర్వదించారు.
అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శ్రీనిక రాకతో వైదేహి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ఒక కూతురిగా, భార్యగా మాత్రమే ఉన్న వైదేహి ఇప్పుడు ఒక అమ్మగా మారి, తనకే పూర్తిగా తెలియని వయసులో ఇంకొక కూతురి బాధ్యత మోస్తూ ఉంది.
అలా చూస్తూ ఉండగానే శ్రీనిక ఫస్ట్ బర్త్డే వచ్చింది.