కుశల ప్రశ్నలన్నీ అయిన తర్వాత, అలా మాటలో మాటగా వైదేహి చదువు గురించి విశ్వనాథ్ గారు కోటేశ్వరరావు గారికి ఇంకా సుజాత గారికి చెప్పారు.
అది విన్న కోటేశ్వరరావు గారు సంతోషపడిపోతే, సుజాత గారు మాత్రం కొంచెం సీరియస్‌గా కూతురి దగ్గరికి వెళ్లారు.
ఊర్మిళ గారు వైదేహి కిచెన్‌లో వంట చేస్తుంటే, “వదినా, ఇప్పుడే వస్తాను” అని కూతుర్ని తీసుకొని తన గదిలోకి వెళ్లారు సుజాత గారు.
“ఏమైందమ్మా? నన్ను ఎందుకు తీసుకొచ్చావ్?” అని అడిగింది వైదేహి తల్లి వైపు చూస్తూ.
“అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? కొంచెం కూడా బుర్ర, బుద్ధి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చదువుకుంటాను అంటావ్ ఏంటి? నీ కాపురాన్ని నువ్వే నీ చేతులారా చెడగొట్టుకోవాలి అనుకుంటున్నావా?” అడిగారు సుజాత గారు.