పాప ఏబీసీడీలు రాసి తల్లికి చూపించింది.
“అబ్బో, సూపర్!” అంటూ నవ్వుతూ, “ఇప్పుడు వన్, టూ నేర్చుకుందామే” అంటూ స్లేట్ మీద వన్, టూ రాసి అవి పాప చేత దిద్దించింది.
“నువ్వు కొంచెం సేపు పాపను చూడు. నేను పడుకుంటాను” అని అత్తగారు రూమ్‌లోకి వెళ్లిపోతే, వైదేహి కూతుర్ని చదివిస్తూ తనని ఆడిస్తూ ఉంది.
రాత్రికి విక్కీ వచ్చినప్పుడు పాప కోసం కొన్ని చాక్లెట్స్, అవి తీసుకొస్తే వైదేహి కోసం స్వీట్ తీసుకొని వచ్చాడు.
“ఇప్పుడు దానికి చాక్లెట్స్ అవసరమా? పళ్ళు పుచ్చిపోతాయి” అంది వైదేహి భర్త వైపు చూస్తూ.