“చిందులు తొక్కుతూ గొడవకి దిగితే, విక్కీ కూడా భార్య అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.
ఇక ఒక్కొక్కటి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది వైదేహి. ఉన్న 15 రోజులు తన ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి అని, ఉన్న టైమ్ మొత్తం కేవలం అత్తమామలకి, భర్తకి, కూతురికి మాత్రమే ఇస్తూ, ఎక్కువగా కూతురితోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఉంది వైదేహి.
అలా చూస్తూ ఉండగానే 13 రోజులైపోయాయి. ఇక భార్యని తీసుకొని పుదుచ్చేరికి స్టార్ట్ అయ్యాడు.
కూతురిని హత్తుకొని, “జాగ్రత్తగా ఉండాలి నువ్వు. నన్ను మిస్ అవ్వవు అని నాకు తెలుసులే, మీ డాడీ ఉన్నప్పుడు. కానీ నానమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? గుడ్ గర్ల్లాగా ఉండాలి” అంది వైదేహి, పాపని గుండెలకి హత్తుకుంటూ.
పాప అమ్మ వెళ్ళిపోతుంటే ఏడుస్తూ, “నేను కూడా వస్తా” అంటూ ఏడవడం మొదలుపెట్టింది.