ఊర్మిళా గారు ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని, “చాలా బాగా చేశావురా! మరి వంట అంతగా రాదు అన్నావ్. చాలా బాగుంది,” అన్నారు చిన్న చిరునవ్వుతో.
విక్కీ కూడా పాయసాన్ని టేస్ట్ చేసి, “బాగుంది వైదేహి” అన్నాడు కాంప్లిమెంట్ ఇస్తూ.
వైదేహి అందరి వైపు చిరునవ్వుతో చూసి, తను కూడా తినడం మొదలుపెట్టింది.
చిన్న కూతుర్ని, కొడుకుని సుజాత గారు తన తల్లి గారి ఇంట్లో పెట్టడంతో అక్కడ లేరు వాళ్లు.
ఆరోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి, ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయారు కోటేశ్వరరావు గారు ఇంకా సుజాత గారు.