అది చూడగానే తనకి తెలియకుండానే నోట్లో నీళ్లు ఊరుతూ ఉన్నా కూడా భర్త తిట్టాడు అన్న కోపంతో, “నాకేం వద్దు. నేను అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను” అంటూ చెప్పేసి అక్కడి నుంచి వైదేహి వెళ్ళిపోయింది.
విక్కీ, వైదేహి వెళ్తున్న వైపే చూసి, “దీనికి ఈ చదువు గోల ఏంటి? అంతా బానే ఉంది. ఆ చదువు ఒక్కటి తప్ప! ఇప్పుడు అది చదువుకొని ఎవరిని ఉద్ధరించాలి అనుకుంటూ?” ఆలోచిస్తూ అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్ళాడు విక్కీ.
రూమ్‌లోకి వచ్చేసరికి అక్కడ గగన, ఇంకా దేవా ఇద్దరూ విక్కీ కొనిచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ, తను తెచ్చిన స్నాక్స్ తింటూ ఉంటే, వాళ్ళని కొంచెంసేపు చూసి, వాళ్లతో కొంచెంసేపు టైం గడిపి బయటికి వచ్చాడు.
భోజనాలు రెడీ అవ్వడంతో అందరూ భోజనానికి కూర్చున్నారు.
వైదేహిని కూడా ఊర్మిళా గారు కూర్చోమని చెప్పి, కోడలికి కూడా వడ్డిస్తూ ఉంటే, వైదేహి కొంచెం తినేసరికి అది తనకి సహించక పరుగున వాష్‌బేసిన్ దగ్గరికి వెళ్లి తిన్నది మొత్తం వాంతి చేసుకుంది.