తననే భయంగా చూస్తున్న రూప నీ నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ వుంటాడు ఆర్య.
అలా ఇద్దరు ఒకరి నీ ఒకరు చూసుకుంటూ వుండగానే ఆ కుక్క వాళ్ళ దగ్గరికి వచ్చి ” భౌ .. భౌ ” అని అరిచింది.
అంతే ఆ కుక్క అరుపు దెబ్బకి భయంతో ఆర్య నీ బల్లిలా కరుచుకొని పోయింది రూప.
ఇప్పుడు రూప బాడీ మొత్తం ఆర్య బాడీ కి టచ్ అవుతుంది..వాళ్లిద్దరి మధ్య గాలి దూరే గ్యాప్ కూడా లేదు. అంతా దగ్గరగా ఉన్నారు ఒకరికి ఒకరు.