🔥 స్త్రీ శక్తి 🔥
అదంతా విన్న ఆద్య ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది. ఇన్ని రోజులుగా తన కళ్లముందే జరుగుతున్న విషయాల వెనుక ఇంత పెద్ద కుట్ర దాగి ఉందని తెలుసుకుని ఆమె మనసు ఒక్కసారిగా కలవరపడుతుంది. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, తనకు ఎదురుగా ఉన్న వ్యక్తిని ఆత్రంగా చూస్తుంది.
ఆద్య:
మరి మీరు ఇన్ని రోజులు వాళ్ల చేతుల్లోనే ఉన్నా ఎలా బయటపడ్డారు? అసలు వాళ్లు మిమ్మల్ని ఎందుకు బ్రతికించారు?
ఆమె ప్రశ్నకు ఆయన బాధతో కూడిన చిరునవ్వు నవ్వుతాడు….