New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 14
స్వయంసిద్ధ Premium 8 min read

స్వయంసిద్ధ – 14

స్వయంసిద్ధ – 14వ భాగం

 

మధ్యాన్నం మూడు గంటల సమయంలో రహదారుల మీద వాహనాల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది.

సిగ్నల్ దగ్గర ఆగిన కార్ల మధ్య నుంచి దారి వెతుక్కుంటూ వెళ్లే బైక్‌ లు, ప్రయాణికులతో నిండిన బస్సులు, తమ గమ్యాన్ని చేరుకోవాలనే తొందరలో ఆటో డ్రైవర్లు కొట్టే హారన్లు!

ఆ శబ్దాల మధ్య నగరం ఉరుకులు పరుగులు పెడుతోంది. ఆ రద్దీని దాటుకుంటూ జాహ్నవి ప్రజావాణి డిజిటల్ కార్యాలయానికి చేరుకుంది.

ఆమె చేతిలో ఒక ఫైల్ ఉంది. సాధారణంగా చూస్తే అది కొన్ని కాగితాల చిట్టా మాత్రమే. కానీ ఆ కాగితాల వెనుక ఒక కుటుంబం కోల్పోయిన కూతురు ఉంది. ఒక తల్లి ఎదురుచూపులు ఉన్నాయి. ఒక తండ్రి మౌనవేదన ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఒక యువతి మరణానికి సంబంధించిన సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి.

తన సీటులో కూర్చున్న జాహ్నవి ఫైల్‌ను టేబుల్ మీద పెట్టింది. బ్యాగ్ పక్కన పెట్టి, ఒకసారి దాన్ని తదేకంగా చూసింది.

‘సౌమ్య మిస్సింగ్ కేస్!’ అని రాసి ఉన్న ఫైల్ ని మెల్లగా తెరిచింది జాహ్నవి.

మొదటి పేజీలో పోలీస్ స్టేషన్ పేరు, కేసు నమోదు చేసిన తేదీ, ఫిర్యాదు చేసిన ఫ్యామిలీ వివరాలు ఉన్నాయి.

కాటిపల్లి సౌమ్య! వయసు ఇరవై రెండు సంవత్సరాలు! డిగ్రీ చదువుతుంది! జాహ్నవి కాసేపు ఆ వివరాలనే చూస్తూ ఉండిపోయింది.

“ఇరవై రెండు సంవత్సరాలు! అంటే ఆ వయసులో ఒక అమ్మాయికి ఎన్ని కలలు ఉంటాయి? చదువు పూర్తి చేయాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, కుటుంబానికి అండగా నిలవాలి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి! ఇలా ఎన్నో ఆశలు ఉంటాయి.

కానీ సౌమ్య జీవితంలో ఆ కలలన్నీ ఎక్కడ ఆగిపోయాయి?” జాహ్నవి తరువాతి పేజీ తిప్పింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue