మాధురి గారిని హాస్పిటల్ తీసుకెళ్లాక అన్ని రకాల బ్లడ్ టెస్ట్ లు చేస్తారు. బ్లడ్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని వస్తుంది రిపోర్ట్స్ లో.దానికి సంబంధించిన మెడిసిన్ ఇచ్చి మళ్ళీ 10 డేస్ తర్వాత రమ్మని చెప్తారు.
అయ్యో డాక్టర్ మా అమ్మ కి నార్మల్ ఫీవర్ అయితే మీరేంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తారు అని అంటుంది త్రిషిక.
ఆ డాక్టర్ తెలిసిన ఆవిడ అవ్వడం వల్ల.
ఏంటి మాధురి నువ్వెప్పుడు డాక్టర్ అయ్యావు నాకు తెలియకుండా అని అంటున్నారు ఆ డాక్టర్.
అబ్బా ఏంటి డాక్టర్ గారు మీరు కూడా అలా అంటారు. నేనేదో ఈ రోజు చూసి తగ్గక పోతే రేపు వద్దాం అని అనుకున్న ఈ లోపు ఇలా జరిగింది.దానికి అందరూ నన్ను ఇలా అనాల్సిన అవసరం లేదు.
సరే సరే లే కొప్పడకు టైమ్ టు టైమ్ మెడిసిన్ వాడు తగ్గిపోతుంది లే అని చెప్తారు డాక్టర్ గారు.
సరే అని డాక్టర్ కి థాంక్స్ చెప్పి 3 ముగ్గురు బయటికి వస్తారు. మాధురి గారు ఇంటికి వచ్చిన దాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు అంటే మాట్లాడితే త్రిషిక, దిలీప్ ఎక్కడ తన మీద యుద్ధం చెయ్యడానికి వస్తారో అని.