New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 23

అగ్నిసాక్షి 🔥 – 23

బుడ్డోడిని ఎత్తుకుని యష్ ముందుకు నడుస్తుంటే, ఆరు మాత్రం అతని వెనకే మౌనంగా నడుస్తోంది. కాసేపటి క్రితం యష్ తనపై కొంచెం గట్టిగా మాట్లాడటంతో ఇంకా అలిగే ఉంది. అసలు తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మధ్యలోనే మాట మార్చడం తనకు నచ్చలేదు. అయినా ఇప్పుడు ఏమీ అనకుండా అతని వెనకే నడుస్తోంది.

 

మళ్లీ ఎక్కడైనా చిన్నగా అరిచినా, తన మీద కోపం చూపిస్తాడేమోనని భయపడుతోంది. అప్పుడప్పుడు అతని వైపు చూస్తూ, అతని ముఖంలో కోపం కనిపిస్తుందేమోనని గమనిస్తోంది. కానీ యష్ మాత్రం బుడ్డోడిని జాగ్రత్తగా ఎత్తుకుని ముందుకు నడుస్తున్నాడు.

 

అలా ఇద్దరూ లోపలికి వస్తుండగా, వాళ్లకు కొంచెం దూరంలో ఉన్న రాధిక ఇద్దరినీ చూసి,

 

“ఏంటి ఆరు, యష్… అక్కడే ఉండిపోయారు? ఇద్దరూ ఇలా లోపలికి రండి!” అంటూ పిలిచారు.

 

“వస్తున్నాం మమ్మీ!” అంటూ ఆరు వెంటనే బదులిచ్చింది.

 

“వస్తున్నాం అత్త!” అన్నాడు యష్.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue