అక్క అక్క… త్వరగా ఇలా రా….పిలిచింది (చెల్లి) అలేఖ్య..
ఏమైందిరా…( తమ్ముడు) అరుణ్ కోసం దోసెలు వేస్తున్నాను అంది కిచెన్ లో ఉన్న అప్పి..
అక్క నీకు ఒకటి చూపించాలి టీవీలో ఇలా రా అంటూ చేయి పట్టుకుని లాకెళ్లింది అలేఖ్య.
బ్రేకింగ్ న్యూస్ : శ్రీశైలం దగ్గర్లో ఉన్నారు రిసార్ట్ లో హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యువతి యువకులు అని వస్తుంది.
ఛీ ఇలాంటి న్యూస్ చూడొద్దమ్మా…. ఏదైనా మూవీ పెట్టుకోండి అంటూ ఛానల్ మర్చబోయింది అప్పి
అక్కను సరిగ్గా చూడు అందులో నాకెందుకో?? శ్రీధర్ బావాలా కనిపిస్తున్నాడు!! అంది కంగారుగా అలేఖ్య…