అప్పి వంట చేస్తూ ఉంటుంది.. పిల్లల ఇద్దరు చదువుకుంటూ ఉంటారు…
అక్కడికి షిఫ్ట్ అయినా నాలుగురోజులు అవుతుంది.. రోజు ఏదో ఒక టైంలో సుగుణ రాజయ్య వచ్చిపోతున్నారు…
అప్పి జీవితం ఎటుపోతుంది ఎప్పుడు నా చేతుల్లోలేదు పుట్టినుంచి మొదలు… ఇప్పటివరకు ఏదో ఒక రూపంలో సమస్య వచ్చి పడుతూనే ఉంది.
చెత్త కుప్పలోంచి మా అమ్మ నన్ను బయటకి తీయకుంటే అప్పుడు నా ప్రాణాలు గాలిలో కలిసి ఉంటే ఈ కష్టాలు నన్ను పలకరించేవికాదు అనుకుంది.
అప్పి వాళ్ళఅమ్మకి సొంత కూతురు కాదు పిల్లలు కలగలేదా తీర్థయాత్రకు వెళ్తే అక్కడ గుడిపక్కన చెత్త కుప్పలో దొరికింది.
అప్పటివరకు ఆ పాపని ఎవరు చూడకపోవడంతో దేవుడి ప్రసాదం అనుకునీ తెచ్చుకున్నారు అల్లరు ముద్దుగా పెంచుకున్నారు ఆ దంపతులు…