అవధులు లేని ప్రేమ – 2
హాయ్ వచ్చేసారా నేను మైత్రియి నా కథను నేను మీకు చెప్పడానికి వచ్చాను అసలు నా జీవితంలో ఏం జరిగిందో మీకు నేను చెప్తాను పదండి.
అమ్ము ఇంకా ఎంతసేపు పడుకుంటావు నిద్రలేయి అని అమ్మ నిద్ర లేపుతుంటే అమ్మ ఫ్లీస్ ఇంకో ఐదు నిమిషాలు ఇలా అందరి ఇంట్లోలా మా ఇంట్లో ఉండదు. మా ఇంట్లో నేను మా నాన్న మాత్రమే ఉంటాం మా అమ్మ ఓ పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేస్తూ తన ప్రాణాలు విడిచింది నేను కూడా మా అమ్మ లాగే చాలా ధైర్యవంతురాలిని ఎంత అంటే నేల మీద బొద్దింకని గోడమీద బల్లిని చూసిన నాన్న అని పిలిచే సారీ అరిచే అంతా
కింద నుంచి మా నాన్న అమ్మ మైత్రి నేను టిఫిన్ కూడా రెడీ చేసేసాను నువ్వు ఇంకా రెడీ కాలేదా అని అరిచారు
నాన్న వస్తున్నా అని కిందకి వెళ్లి నాన్నతో కలిసి టిఫిన్ చేసి నాన్న స్కూల్ కి నేను కాలేజీకి బయలుదేరము అయ్యో మా నాన్న పేరు చెప్పలేదు కదూ మా నాన్న మురళీధర్ స్కూల్లో హెడ్మాస్టర్ నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు నాన్న నాన్నకు నేను అంతే. నాకు ఓ ఫ్రెండ్ కూడా ఉందండి జాన్ జిగిరి దోస్త్ తన పేరు కళావతి
నాకు ఉన్న ధైర్యానికి తను నాకు పెద్ద బలం. బలం అని ఎందుకన్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఇప్పుడు తనని ఇదిగో నా స్కూటీపై ఎక్కించుకొని కాలేజ్ కి వెళ్ళాలి
కళావతి ఇంటి ముందుకు వెళ్ళి హారన్ కొట్టగానే కళా వచ్చి ఏంటే ఈ రోజు కరెక్ట్ టైం కి వచ్చావ్ అంటే ఈరోజు కూడా వంట అంకులే చేశారా అని అడిగింది
తనని కాల్చేసేలా చూస్తూ నువ్వు ఒక్క దానివి చాలు నా పరువు తీయడానికి ఎక్కు కాలేజీకి పోదాం అని మేము కాలేజీకి బయలుదేరాము
నేను గుడ్ గర్ల్ కాబట్టి నేరుగా క్లాస్ కి వెళ్లి బుద్దిగా చదువుకొని కళాని తన ఇంట్లో దింపేసి నేరుగా ఇంటికి వచ్చేసాను
నేను వచ్చేటప్పటికి నాన్న ఇంకా ఇంటికి రాలేదు సరే అని ఫ్రెష్ అయ్యి నాన్న వచ్చేలోపు ఇంటి పనులు చేసి డిన్నర్ కూర ప్రిపేర్ చేస్తుండగా నాన్న వచ్చారు నాన్నను చూసి నేను నాన్న కాఫీ తీసుకురానా అని అడిగాను
నాన్న కొంచెం స్ట్రాంగ్ గా తీసుకురారా అని చెప్పారు కాఫీ పెట్టి దాంతో పాటు వాటర్ కూడా తీసుకొని వెళ్లి నాన్నకి ఇచ్చాను నాన్న వాటర్ తాగి తర్వాత కాఫీ తీసుకున్నారు
నేను నాన్న పక్కనే కూర్చుని ఏమైంది నాన్న ఈరోజు కాఫీ స్ట్రాంగ్ అడిగారు అని అడిగాను
నాన్న బయట రోడ్లో పెద్ద గొడవ జరుగుతుంది రా ఎవరో రౌడీ వెధవ అంతా గందరగోళం చేశాడు అందుకే కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అన్నాడు
నేను నవ్వుతూ నాన వైపు చూసి నాన్న ఆ గొడవ గురించి వదిలేయండి నైట్ నేను డిన్నర్ కి మీకోసం చపాతి చేస్తున్న అందులోకి మీకు ఇష్టమైన పన్నీర్ బట్టర్ మసాలా మీకు ఓకే కదా అని అడిగాను
నాన్న నవ్వుతూ ఇప్పుడు ఎందుకురా అంత ఏదైనా సింపుల్గా చేసి నువ్వు చదువుకోవచ్చుగా అన్నాడు
నాన్న నేను ఇప్పుడు వెళ్లి కచ్చితంగా చదువుకుంటాను తినేసాక ఏంటో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అందుకే మీకోసం చేశాను అని చెప్పాను
నాన్న నవ్వుతూ సరే నీ ఇష్టం తల్లి నేను ఫ్రెష్ చేస్తాను అని ఆయన గదికి వెళ్ళిపోతే నేను అక్కడి నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోయాను
డిన్నర్ మొత్తం ప్రిపేర్ చేసి దాన్ని టేబుల్ మీద సర్దేసి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి నా రూమ్ లో కూర్చుని చదువుకోవడం మొదలు పెట్టాను కాసేపటి తర్వాత నాన్న మైత్రి డిన్నర్ చేద్దాం రా అని పిలిచిన పిలుపుకి వస్తున్నా నాన్న అని నేను నాన్నతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్ళాను
నేను నాన్న కలిసి డిన్నర్ చేసి తర్వాత నాన్నతో పొద్దున్నుంచి జరిగినవన్నీ చెప్పి కాసేపు మాట్లాడుకుని కొంచెం సేపు టీవీ చూసి తర్వాత నేను నాన్న ఇద్దరం ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయాం నిద్రపోవడానికి
ఇదేనండి నా లైఫ్ రోజు పొద్దున్నే లేచి నేను నాన్న కలిసి ఇంటి పనులు చేసుకుని తర్వాత కళాతో కలిసి కాలేజీకి వెళ్లడం సాయంత్రం నాన్నతో కలిసి కబుర్లు చెప్పుకుని టీవీ చూసి నిద్రపోవడం ఇంతే
గదిలోకి వచ్చిన నాకు నా ఫోన్ రింగ్ వినిపించింది చూస్తే కళా ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి తనతో కొంచెంసేపు మాట్లాడి రేపు ఏం జరుగుతుందో అని ఆలోచన లేకుండా హాయిగా పడుకున్నాడు
రేపు నా జీవితాన్నే మార్చేసే సంఘటన జరుగుతుంది అని ముందే తెలిస్తే ఆ రాత్రి అసలు తెల్లవారకూడదు అని కోరుకునే దాన్నేమో కానీ ఆ నిమిషం నాకు తెలియలేదు ప్రశాంతమైన నా జీవితంలోకి అల్లకల్లోలం గా మారుతుందని
రేపు ఏం జరగబోతుంది ?
నక్షత్ర
Swipe left/right or tap the sides to turn pages