“మీరు సరదాగా ఎంజాయ్ చేయండి… పిల్లల్ని మేము చూసుకుంటాము… మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు… మేము జాగ్రత్తగానే ఉంటాం…” అని జగదీశ్వరి గారు ప్రేమగా చెబుతారు…
ఇలా సపోర్ట్‌గా ఉండే అత్తగార్లు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో… ఇలాంటి అత్త దొరికితే ఏ కోడలైనా నిజంగా అదృష్టవంతురాలే కదా…
కొడుకు, కోడలు సంతోషంగా ఉండాలని కోరుకునే జగదీశ్వరి గారు… సత్యని కోడలిలా కాకుండా కూతురిలానే చూసుకుంటారు… అందుకే సత్య కూడా ఆమెని అత్తగారిలా కాకుండా అమ్మలాగే భావిస్తుంది…
అలా ఈవెనింగ్ ఫంక్షన్‌కి వెళ్లడానికి సత్య చక్కగా రెడీ అవుతుంది… లైట్ వెయిట్ శారీలో, సింగిల్ సైడ్ పల్లు వేసుకుని చాలా అందంగా కనిపిస్తుంది… సింపుల్ లుక్‌లోనే ఆమె మరింత అందంగా మెరిసిపోతూ ఉంటుంది…
అందంగా రెడీ అయిన భార్యని చూసిన అఖిల్ కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు…
“ఏంటి బంగారం… ఈరోజు చాలా అందంగా ఉన్నావు… నాదిష్టే తగిలేలా ఉంది…” అంటూ నవ్వుతూ ఆమె చెవి వెనక చిన్నగా దిష్టి చుక్క పెడతాడు…