New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 11

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 11

అఖిల్ కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తూనే, అతను చూపిస్తున్న హ్యాండ్ మూమెంట్స్‌కి తగ్గట్టుగా సత్య కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది… మొదట్లో కొంచెం సిగ్గుగా ఫీల్ అయినా, అఖిల్ కళ్లల్లో కనిపిస్తున్న ధైర్యం చూసిన తర్వాత పూర్తిగా అతని మీద నమ్మకంతో డాన్స్ చేస్తూ ఉంటుంది…

 

అఖిల్ ఒకసారి ఆమె చేతిని పట్టుకుని తిప్పితే, సత్య కూడా అతనితో పాటు చక్కగా తిరుగుతుంది… అతడు ఎలా స్టెప్ వేస్తే అలా ఆమె కూడా వెంటనే ఫాలో అవుతూ ఉంటుంది… వాళ్లిద్దరి మధ్య ఒక్క మాట కూడా లేకపోయినా, కళ్లతోనే ఎన్నో విషయాలు మాట్లాడుకున్నట్టుగా అనిపిస్తుంది…

 

సత్య మాత్రం డాన్స్ చేస్తూనే ఎక్కువగా అఖిల్ కళ్లల్లోకే చూస్తూ ఉంటుంది… అఖిల్ కూడా ఆమెని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు… వాళ్లిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం డాన్స్‌లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది…

 

మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఇద్దరూ ఒకే రిథమ్‌లో మూవ్ అవుతుంటే, అక్కడున్న స్టాఫ్ మొత్తం వాళ్లవైపే చూస్తూ ఉండిపోతారు…

 

అలా డాన్స్ పూర్తయ్యే వరకు ఆఫీస్ స్టాఫ్ అందరూ కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటారు…

 

“ఏంట్రా బాబు… ఇంత అందంగా, ఇంత పర్ఫెక్ట్‌గా ఎవరైనా డాన్స్ చేస్తారా?” అన్నట్టుగా అందరూ వాళ్లిద్దరినీ చూస్తూ ఉంటారు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue