టిఫిన్ కంప్లీట్ చేసేటప్పటికి వీళ్ల కోసం టమాటా పప్పు, పొటాటో ఫ్రై కూడా రెడీ చేస్తుంది… లంచ్ బాక్సులు కూడా ప్యాక్ చేసుకుని హాల్లోకి వస్తుంది…
అప్పటికే అఖిల్, పిల్లలు టై, బెల్ట్, షూస్ వేసుకుని రెడీగా ఉంటారు… సత్య లంచ్ బాక్సులు తీసుకొచ్చి వాళ్లకి ఇస్తుంది…
వాటిని తీసుకుని స్కూల్‌కి, ఆఫీస్‌కి వెళ్లడానికి సిద్ధమవుతారు… సత్య ఎదురుగా వచ్చి “జాగ్రత్తగా వెళ్లండి…” అని చెప్పడంతో, “అలాగే…” అంటూ అఖిల్ పిల్లలతో కలిసి కార్లో బయలుదేరుతాడు…
అలా ముగ్గురూ కార్లో బయలుదేరి, ముందుగా పిల్లల్ని స్కూల్లో దించి, తర్వాత అఖిల్ ఆఫీస్‌కి వెళ్లిపోతాడు…
పది నిమిషాల తర్వాత జగదీశ్వరి గారు, ప్రకాష్ గారు కూడా వాకింగ్ నుంచి ఇంటికి వస్తారు… రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు…
వాళ్లు వచ్చేసరికి సత్య ఇల్లంతా క్లీన్ చేసి నీట్‌గా ఉంచుతుంది… వాళ్లని చూసి వెంటనే కిచెన్‌లోకి వెళ్లి ఇద్దరి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది…