నెక్స్ట్ రౌండ్‌కి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉండటంతో సత్య ఉదయం నుంచే ప్రాక్టీస్ షెడ్యూల్ రెడీ చేస్తుంది.
“రోజుకి రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. మన పెర్ఫార్మెన్స్లో ఒక కథ కనిపించాలి. మనం కేవలం స్టెప్స్ వేయడానికి కాదు… చూసేవాళ్ల మనసులో నిలిచిపోవడానికి స్టేజ్ మీదకి వెళ్లాలి” అంటుంది సత్య.
అఖిల్ కూడా ఆమెతో కలిసి పిల్లల కోసం కొత్త కొరియోగ్రఫీ చేయడం మొదలుపెడతాడు.
ఇద్దరూ కలిసి ప్రతి స్టెప్ని డిస్కస్ చేస్తూ ఉంటారు.
“ఇక్కడ పిల్లలంతా ఒకేసారి టర్న్ తీసుకుంటే ఎలా ఉంటుంది?” అని అఖిల్ అడుగుతాడు.
“బాగుంటుంది… కానీ చివర్లో రాహుల్ ముందుకు వచ్చి సోలో చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది” అంటుంది సత్య.