New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 8

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 8

ఇద్దరి ఇష్టంతో జరిగే కలయికలో వాళ్ల ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించదు… ఇద్దరూ ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకునే పనిలోనే ఉంటారు… ఎన్నో రాత్రులు గడిచినా కూడా, ప్రతిసారీ మొదటి రాత్రిలాగే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను కొత్తగా అనుభూతి చెందుతూ, ఆ రాత్రిని మధురమైన జ్ఞాపకంగా మార్చుకుంటారు…

 

కొంతమంది మనుషులు భార్య ఇష్టంతో పని లేకుండానే తమకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు… కానీ కలయిక అంటే కేవలం రెండు శరీరాలు దగ్గరవడం మాత్రమే కాదు… రెండు మనసులు కూడా దగ్గరవ్వడం… ఒకరినొకరు అర్థం చేసుకోవడం… ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించడం…

 

అది తెలుసుకున్న ప్రతి మనిషి, తన జీవిత భాగస్వామి ఇష్టంతోనే దగ్గరవ్వాలని అనుకుంటాడు… ఎందుకంటే మనిషితో పాటు మనసును కూడా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ బంధంలో నిజమైన ఆనందం ఉంటుంది… ఇష్టం లేని పెళ్లి… ఇష్టం లేని సంసారం… రెండూ వ్యర్థమే కదా…

 

నెక్స్ట్ మార్నింగ్ 6కి సత్య నిద్రలేచి ముందుగా ఫ్రెష్ అయ్యి రెడీ అయి హాల్లోకి వస్తుంది… ముందుగా పూజ మందిరంలోకి వెళ్లి పూజ చేసుకుని దీపారాధన చేసి, పూజ కంప్లీట్ చేసుకుని కిచెన్‌లోకి వెళుతుంది…

 

అప్పటికే రాత్రే అన్నీ క్లీన్ చేసి ఉండటంతో ముందుగా స్టవ్ వెలిగించి పాలు పెట్టి కాఫీ ప్రిపేర్ చేస్తుంది… పది నిమిషాల్లో రెండు కప్స్ కాఫీ రెడీ చేసుకుని అఖిల్ దగ్గరికి వెళుతుంది…

 

నెమ్మదిగా అఖిల్‌ని లేపుతూ, “శ్రీవారు… కాఫీ తాగుదురు లేండి…” అని అంటుంది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue