ప్రేమదేశం యువరాణి 💘 – 3
ప్రేమదేశం యువరాణి 💘 3.
చెప్పండి నా మనవడు తిరిగి రావడం మీలో ఎవరికి ఇష్టం లేదు కదా గంభీరంగా అడిగాడు. ఆ గొంతు వినిపించిన వైపు చూసిన అందరూ అక్కడ నిలబడి ఉన్నాయని చూసి ఎక్కడి వాళ్ళు అక్కడ అటెన్షన్ మోడ్ లోకి వచ్చారు.
ఆయన ఎవరో కాదు వర్మ వంశానికి మూల పురుషుడు విహారికి తాతయ్య ఆయన పేరు జగదీష్ వర్మ ఆయనకి విహారి అంటే పంచప్రాణాలు….
తన మనవడు అచ్చం ఆయన నాన్నగారిలా ఉంటాడని జగదీష్ గారికి విహారి అంటే మొదటి నుంచి ఎంతో ప్రేమ చనిపోయిన తన తండ్రిని మనవడిలో చూసుకుంటూ ఆయన మురిసిపోతూ ఉంటాడు.
అలాంటిది ఒక తప్పూ కారణంగా తన మనవడు ఐదు సంవత్సరాలుగా…. తన మనవడిని చూడకుండా తన మనవడు తమని చూడకుండా దూరంగా ఉంటూ…..
తమకు విధించిన శిక్షకి ఆయనకి గుండె బరువెక్కింది. ఎప్పుడెప్పుడు తన మనవడిని చూస్తానని ఎదురు చూస్తున్నా ఆయనకి తమ మనవడు ఇప్పటికప్పుడు దూరంగా పెట్టడం అసలు తమను చూడడానికి కూడా ఇష్టపడకపోవడం ఆయనకు ఎంతో బాధని కలిగించింది.
ఆ బాధతోనే ఆయన హార్ట్ స్ట్రోక్ తెచ్చుకున్నాడు. తన తాతయ్య కి స్ట్రోక్ అని తెలిసి విహారి ఇండియాకి బయలుదేరాడు.
ఈరోజు ఉదయమే ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాడు.
హారతి పళ్లెం పూజ గదిలో పెట్టి బయటికి వచ్చిన జగదీష్ గారి భార్య చాముండేశ్వరి ఆయన దగ్గరికి వచ్చి ఎందుకంటి అలా మాట్లాడతారు.
మనమందరం ఎదురు చూసేది నా మనవడు ఇక్కడికి రావడం కోసమే కదా?
నా మనవడు వస్తుంటే మేమెందుకు సంతోషంగా ఉండము అయినా మీరు ఎందుకు ఇలా బయటికి వచ్చారు. మీరున్న కండిషన్లో ఇంత కోపంగా అరవచ్చా అది మీకు మంచిది కాదు.
అసలే మీకు స్టంట్ వేశారు మీరు ఇలా కోప్పడడం మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? బాధగా అడిగింది అది కాదు చాముండి ఇప్పుడు నాకు ఆరోగ్యం కంటే నా మనవడు ఇక్కడికి రావడం ముఖ్యం.
నా మనవడిని నేను చూడాలి ఇంకా ఎందుకు నా మనవడు ఇక్కడికి రాలేదు. మీరందరూ ఏం చేస్తున్నారు ఇంకో ఐదు నిమిషాల్లో నా మనవడు నా కళ్ళ ముందు లేకపోతే మీ అందరిని షూట్ చేసి పడేస్తాను గర్జించాడు.
మీను కాలేజీకి వెళ్లేసరికి ఆల్రెడీ తన క్లాస్ స్టార్ట్ అవ్వడంతో లెక్చరర్ ని చూసి తను ఒక్కసారిగా నీరసపడిపోయింది….. అబ్బా ఈమె నా ఇప్పుడు లేట్ ఎందుకు అయింది అని అడుగుతుంది.
ఇది నిజం చెప్పిన అబద్ధం చెప్పాను అనుకుని నాకు క్లాస్ పీకుతుంది. ఇప్పుడు ఎలా క్లాసులోకి వెళ్ళేది అసలు డెమోకి లేట్ అయ్యాను. ఈమె కి ముందే నేనంటే పీకలు దాకా కోపం ఇప్పుడు డెమో అని కూడా మిస్ అయ్యాను అంటే ఖచ్చితంగా సెమిస్టర్ లో మార్క్స్ తగ్గిస్తుంది.
ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తూ బయట నిలబడిపోయింది. అదే క్లాసులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు మాటిమాటికి గుమ్మం వైపు చూస్తుంటే ఆ లెక్చరర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి ఇక్కడ నేను చెప్పేది వినకుండా అటు చూస్తున్నారు.
తర్వాత మీద డెమో ప్రిపేర్ అయ్యారా? అవును మీ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ తను ఇంకా రాలేదు ఇంతకీ మేడం గారు వస్తారా రారా?
చూడండి ఈ డెమో ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు పైగా ఈ ప్రాజెక్టుకి మీను ముఖ్యం తను ఒకవేళ డెమో ఇవ్వడానికి రాకపోతే ఆ ప్రాజెక్ట్ నుంచి తన్ని తీసేయడంతో పాటు సెమిస్టర్ లో తనకి మార్క్స్ కూడా తగ్గిస్తాను అని బెదిరించే వెళ్ళింది.
బయట గోడ పక్కన నిలబడి ఆ మాటలన్నీ వింటున్న మీను పళ్ళు పటపట కొరుకుతూ ఈవిడకి ఎప్పుడు నామీద కన్ను ఈమె కూతురు చదవకపోతే అది నా తప్ప…..
ఎప్పుడు సెమిస్టర్ లో నాకు మంచి మార్కులు వస్తాయని కూతురు నా కంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటుందని ఉంటుందని నా మీద పడి ఏడుస్తుంది.
కూతురికి మంచిగా చదువు చెప్పొచ్చు కదా కూతుర్ని మంచిగా చదువుకోమని చెప్పొచ్చు కదా అలా చేయడం చేతకాదు కానీ నా మీద ఏడవడానికి ఫస్ట్ ఉంటుంది ఇంకా అర్థగంటలో నేను డెమో ఇవ్వకపోతే ఈమె చెప్పినట్టే చేస్తుంది టెన్షన్ పడుతూ గోర్లు గిల్లుకుంటూ గది బయట నిలబడింది.
విహారి చాపర్నే రుగా ఎయిర్పోర్ట్లో ఆగింది. అందులో నుంచి విహారి స్టైల్ గా దిగి తన కోర్టు సెట్ చేసుకొని కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని చాపర్ నుంచి బయటికి వచ్చి ఆల్రెడీ తనకోసం రెడీగా ఉన్న కారు కార్లో కూర్చున్నాడు.
విహారి కూర్చోగానే అతని కారు నేరుగా మెన్షన్ వైపు దూసుకుపోయింది.
విహారి ముందు ముందు సీట్లో కూర్చున్నా అతని అసిస్టెంట్ కి కాల్ వచ్చింది. కాలర్ ఐడి లో ఉన్న పేరు చూసి అసిస్టెంట్ వెనక్కి తిరిగి మీ పెద్ద సార్ కాల్ చేస్తున్నారు సార్ ఏమని సమాధానం చెప్పాలి సార్ వినయంగా అడిగాడు .
అసలు కాల్ లిఫ్ట్ చేయొద్దు నేను ఇండియాకు వస్తున్న విషయం వాళ్లకు ఎలా తెలిసింది నువ్వు కానీ చెప్పావా లేకపోతే ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా గంభీరంగా అడిగాడు ఆ మాటకి అసిస్టెంట్ వనికిపోతుంది ఏం సమాధానం చెప్పకుండా తలకిందుకు దించుకున్నాడు.
కథ వర్ణికలో ఇది నా ఫస్ట్ స్టోరీ ✍️ నేను ఆల్రెడీ ప్రతిలిపి లో కథలు రాస్తున్నాను. ఇందులో ఫస్ట్ టైం రాయడం స్టోరీ చదవండి కామెంట్ చేయండి ఏదైనా తప్పులు ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్ అలాగే నన్ను ఫాలో అవ్వండి…..
Swipe left/right or tap the sides to turn pages