ప్రేమదేశం యువరాణి 💘 – 2
ప్రేమదేశం యువరాణి 2.
నువ్వే ఏం చేస్తావో నాకు తెలియదు తిను నాకు కావాలి మీను ఫోటోని చూస్తూ అలా ఉండిపోయాడు.
మన హీరో విహారి వర్మ చూడడానికి ఆరడుగుల అందగాడు సింహాన్ని తలపించే తీక్షణమైన చూపు ఎవరినైనా సరే ఎదిరించే అంత గుండె ధైర్యం….. తను కావాలనుకున్నది దక్కించుకునేంత పట్టుదల అన్నిటికీ మించి తన వాళ్ళ కోసం ఏదైనా చేసే తెగింపు…..
ఇవన్నీ విహారి వర్మ సొంతం విహారి వర్మ ఎంపైర్స్ కి మొదటి వారసుడు. అతను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి….. అతనికి కావాల్సింది దక్కించుకోవడం కోసం విహారి ఎంత దూరమైనా వెళ్తాడు.
తనకు నచ్చిన వస్తువు అయినా ఇంకేదైనా సరే ఒక్కసారి విహారి చూపు దాని మీద పడితే అది తనకు సొంతం అవ్వాల్సిందే లేదంటే అతనిలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు.
నిజానికి విహారి వర్మ ఎంపైర్స్ కి మొదటి వారసుడే కాదు తనకంటూ ఒక పెద్ద బిజినెస్ వరల్డ్ సృష్టించుకున్న కౄయల్ మాన్ ఒంటి చేత్తో ఒక సొంత సామ్రాజ్యాన్ని స్థాపించుకొని…..
ఇప్పుడు తన తాతయ్య కోసం ఆయనకిచ్చిన మాట కోసం వర్మ కంపెనీస్ ని టేక్ ఒవర్ చేయడానికి ఐదు సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి ఇండియాకు వచ్చాడు.
హైదరాబాద్ సిటీకి దూరంగా ఒక పెద్ద మెన్షన్ రాజులు కాలం నాటి ఆ మ్యాన్షన్ ఎటు చూసినా రాజసం ఉట్టి పడుతూ ఉంటుంది.
కొన్ని వందల ఎకరాల్లో ఆకాశానికి నిచ్చెన వేసినట్టు ఉన్నా ఆ మ్యాన్షన్ లో ఎటు చూసినా తమ హోదా ఇదే అని తెలిపేలా ఆ మెన్షన్ లో ప్రతి ఒక్క గది ప్రతి ఒక్క మూల ఉంటాయి.
ఆ మెన్షన్ బయట విహారి వర్మ నిలయమని గోల్డ్ ఇటాలిక్ అక్షరాలతో ఎంతో అందంగా రాసింది.
ఆ మెన్షన్‌లో లోపలికి అడుగుపెడితే చాలు తమ వచ్చింది మెన్షన్ లేకపోతే ఇంద్ర భవనాన్ని అని ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలగక మానదు.
ఆ మెన్షన్ తిరిగి చూడడానికే దాదాపుగా వారం రోజులు పడుతుంది. తమ జీవితంలో ఇలాంటి మెన్షన్ లో ఒక రోజైనా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకోకుండా ఉండలేరు.
ఆ మ్యాన్షన్ పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకుంటూ శివయ్య ఇంత కాలానికి నీకు మా మీద దయ కలిగిందా?
ఇంత కాలానికి నా మనవన్ని నా దగ్గరికి రప్పిస్తున్నావ్ నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా…..
అలాగే నా మనవడు ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోకుండా వాడికి మా మీద కోపం తగ్గి ఎప్పుడు మాతోనే ఉండేలా చెయ్యి….
మేం చేసింది తప్పే దానికోసం గత ఐదు ఏళ్లుగా బాధపడుతూనే ఉన్నాం. ఆనాడు మేము ఆ పని చేయకపోయి ఉంటే నా మనవడు ఇంతకాలం నాకు దూరంగా ఉండేవాడే కాదు.
ఇంత కాలానికి వాడు వాళ్ళ తాతయ్య మాటకు కట్టుబడి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడికి వచ్చే వాన్ని శాశ్వతంగా మా దగ్గరే శాశ్వతంగా ఉండిపోవాలి….
నా మనవడు మళ్ళీ దూరమైతే తట్టుకునే శక్తి ఈ ముసలి గుండె కి లేదయ్యా దేవుని వేడుకుంటూ తన మనసులోని బాధ చెప్పుకుంది.
దేవుడికి హారతి ఇచ్చి ఆమె హారతిని బయటికి తీసుకొచ్చింది. మెన్షన్ లో ఉండే వాళ్ళందరూ పూజ గది ముందు నిలబడి తమ మనసులోని కోరికలనే ఆ దేవుడికి చెప్పుకొని ఆమె ఇచ్చిన హారతిని అందరూ కళ్ళకు అద్దుకొని అమ్మ పెట్టిన ప్రసాదం తీసుకొని అందరూ డైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చారు.
ఇంకా విహారి రాలేదా ఇంకా ఎంతసేపు టైం పడుతుంది ముందు వెళ్లి విహారిని ఇక్కడికి తీసుకురండి…..
నేను నా మనవడిని చూడాలి అయినా నా మనవడు వస్తున్నాడు అంటే అందరూ ఎందుకు అలా ఉన్నారు.
నా మనవడు రావడం మీకు ఎవరికి ఇష్టం లేదా ఐదు సంవత్సరాల తర్వాత వర్మ వారసుడు తిరిగి వస్తుంటే సంబరాలు చేయాల్సింది పోయి అందరూ ఎందుకు అలా ఉన్నారు గంభీరమైన గొంతు వినిపించింది అందరూ ఆ గొంతు వచ్చిన వైపు చూశారు.
దాదాపుగా గంటన్నర తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ గంటన్నర మీను కష్టంగా తన కోపాన్ని అణుచుకుంది.
ఏం మనిషిలో ఏంటో ఒకరి కోసం అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ఆ వర్మ వారసుడు ఏమైనా పై నుంచి దిగొచ్చాడా?
అతని కోసం అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు సిటీ అంతా బ్లాక్ చేసి ఆయన ఏం చేస్తాడు వచ్చేవాడు ఎలాగో వస్తాడు ఆయన కోసం మిగతా వాళ్లందర్నీ కష్టపెట్టడం ఎందుకు.
పాపం అందరూ ఆఫీస్‌కి కాలేజీలోకి వెళ్లే టైం కి ఇలా చేస్తే ఎలా?
నా డెమో కూడా టైం అయిపోయింది ఇప్పుడు వెళ్లిన ఉపయోగం లేదు డబ్బుంటే చాలు ఏమైనా చేయొచ్చని పొగరు వీళ్ళకి ఇటువంటి వాళ్లకి దేవుడు ఏదో ఒకరోజు శిక్ష విధిస్తాడు.
డబ్బు ఒక్కటి ఉంటే సరిపోతుందా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న మినిమం కామెంట్ సెన్స్ కూడా ఉండాలి కదా?
అతను ఒక్కసారి నాకు కనపడాలి నిలబటి కడిగేస్తా కోపంగా విహారిని పిచ్చి తిట్లు తిడుతూ ఉంది మీను….
ఇగ్నోర్ మిస్టేక్స్…..
ఇంకా ఉంది.
Swipe left/right or tap the sides to turn pages