ప్రేమదేశం యువరాణి 💘 – 4
ప్రేమదేశం యువరాణి 💘 4.
నేను ఇండియా వస్తున్న విషయం వాళ్లకు ఎలా తెలుస్తింది? నువ్వే చెప్పావా లేకపోతే ఇంకా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా?
విహారి అడిగిన మాటకి అసిస్టెంట్ తలవంచుకోవడంతో అతనికి మేటర్ పూర్తిగా అర్థమైంది.
విహారి అసిస్టెంట్‌ని ఏమీ అనలేదు కానీ అతని మనసులో ఐదేళ్ల క్రితం జరిగినది ఇంకా మెదులుతూనే ఉంది.
అది గుర్తొస్తుంటే అతనికి కోపం అసహనం ఇంకా బాధ ఇవన్నీ పోటీపడి ఒకదాని వెంట ఒకటి అతనికి గుండెని దహించి వేస్తున్నాయి….. కోపంతో తన పిడికిళ్ళు గట్టిగా బిగిసుకున్నాయి.
ఆవేశం అతన్ని స్థిరంగా ఉండనివ్వడం లేదు అతని కళ్ళు రెండు చింత నిప్పులా ఉన్నాయి. అసిస్టెంట్ కి విహారిని చూస్తుంటే భయంతో ఎక్కడ తన గుండాగి పోతుందో అనిపిస్తుంది.
ఇప్పుడు మెన్షన్ కి వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో తెలియక అసిస్టెంట్ చెమటలు పడుతున్నాయి అసిస్టెంట్ మనసులోనే దేవుడా ఇప్పుడు అక్కడ ఏం జరిగినా సరే మా సార్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేచేయి…..
ఆయన తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండేలా చెయ్ ఆయన వెళ్లిపోయిన ఐదు సంవత్సరాలు వర్మ బిజినెస్ లో ఎన్ని అవకతవకలు జరిగాయి…..
ఇప్పుడు వర్మ కంపెనీస్ ఎటువంటి స్థితిలో ఉందో సార్ కి ఇంకా తెలియదు ఆ విషయం తెలిస్తే ఆయన కోపం ఇంకెంత పెరుగుతుందో ఏంటో అని మనసులోని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు.
నాన్నగారు మీ బాధ ఆవేదన నాకు అర్థమైంది. దయచేసి నేను చెప్పేది వినండి విహారి అమెరికా నుంచి ఇక్కడికి బయలుదేరాడు.
ఇంకొక పది నిమిషాల్లో మన మెన్షన్ లో ఉంటాడు. దయచేసి మీరు ఇంతలా ఆవేశపడకండి మీ ఆరోగ్యానికి అది అస్సలు మంచిది కాదు. మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది మీకు డాక్టర్ గారు చెప్పారు కదా…..
మీరు అసలు ఆవేశపడకూడదని మీరు ఏదన్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది గుండె మీద ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుందని……
దయచేసి మీరు గదిలోకి వెళ్ళండి నాన్నగారు విహారి వచ్చిన వెంటనే తన తీసుకొని నేనే మీ రూమ్ కి వస్తాను. ప్లీజ్ అమ్మ నాన్న గారిని లోపలికి తీసుకొని వెళ్ళు అన్నాడు. విహారి తండ్రి అతని పేరు విజయేంద్ర వర్మ జగదీష్ వర్మ గారి పెద్ద కొడుకు…..
ఆ ఇంటికి జగదీశ్ తరువాత స్థానంలో విజయేంద్ర ఉంటాడు విజయేంద్ర అంటే ఆ కుటుంబంలో అందరికీ ఎంతో భయం భక్తులు ఉన్నాయి. ఆయన ఈ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించాలని చూస్తాడు ముందు ఆలోచించి ఆ తర్వాత అలుగు వేస్తాడు ఆయన ఎంతో సమర్థవంతుడు.
అవునా నాన్న గారు అన్నయ్య చెప్పింది నిజమే దయచేసి మీరు లోపలికి వెళ్ళండి విహారి వచ్చిన వెంటనే మీ దగ్గరికి తీసుకొని వస్తాం ప్లీజ్ నాన్నగారు దయచేసి మా మాట వినండి అంది…..
జగదీష్ వర్మ గారి కూతురు ఆమె పేరు నలిని జగదీష్ గారు తన స్థాయికి తగినట్టే ఆమె కూతుర్ని కోటీశ్వరుడికి ఇచ్చే పెళ్లి చేశారు ఆమెకి ఇద్దరు పిల్లలు వాళ్ల గురించి ముందు ముందు ఎపిసోడ్ లలో వస్తుంది.
అమ్మ నళిని అది కాదమ్మా నేను నా మనవడిని చూడాలి వాడిని చూడకపోతే ఎక్కడ నాకు ఊపిరి ఆగిపోతుందని భయంగా ఉందమ్మా…
ఆయన మాట విని అక్కడున్న వాళ్ళందరికీ ఒక్క క్షణం కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఆయన ఎలాంటి వాడో తెలిసి ఆయన ఇప్పుడు ఇలా మనవడి కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంటే వాళ్ళందరికీ ఎంతో బాధగా ఉంది.
అక్కడ ఉన్న అందరూ బాధపడుతున్నారు కానీ ఆ హాల్లో ఉన్న ఇద్దరు మాత్రం ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకొని క్రూరంగా నవ్వుకున్నారు.
వసుంధర తన క్లాస్‌లన్నీ కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ లంచ్ కి తిరిగి తన స్టాఫ్ రూమ్ కి వెళ్ళింది.
అప్పటికే అక్కడున్న మిగతా టీచర్స్ అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. వసుంధర రావడంతో వాళ్ళందరూ ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించి ఏంటి?
మేడం ఈరోజు లేట్ అయింది ఏం చేద్దాం పిల్లలకి ఎగ్జామ్స్ కదా పైగా నా సబ్జెక్టు అంటే వాళ్ళకి ముందే భయం అందుకే ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. అవును పిల్లలందరికీ మ్యాథ్స్ అంటే భయం కానీ మీరు చెప్పే మ్యాథ్స్ ని మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా చేస్తున్నారు.
పిల్లలకి ఆ సబ్జెక్ట్ మీద ఉండే భయాన్ని మీరే దూరం చేసి వాళ్ళని చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. ప్రతిసారి ఎగ్జామ్స్ లో మా అందరి సబ్జెక్టులలో తక్కువ మార్కులు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీ సబ్జెక్టు లో మాత్రం బాగా స్కోర్ చేస్తున్నారు.
ఆ మాటకి వసుంధర మనసులో ఇష్టం ఉంటే కష్టం దూరంగా పారిపోతుంది మేడం వాళ్లకు సులభంగా అర్థమయ్యేల చెప్తే వాళ్లే అర్థం చేసుకుంటారు.
స్టూడెంట్స్ అందరూ ఇద్దరిద్దరుగా వచ్చి తమ డెమోని ఇచ్చి ప్రాజెక్టు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. అలా ఒక్కొక్కరి డెమో చూస్తూ ప్రాజెక్టులను సబ్మిట్ చేస్తూ ఉండగానే ఆఫ్టర్నూన్ అయింది.
పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి ఆ లెక్చర్ బయటికి వెళ్ళింది. ఇదే అదునుగా చూసి మీను ఫాస్ట్ ఫాస్ట్ గా తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది.
తమ ఎదురుగా నిలబడి ఉన్న మీనిని చూసి తన ఫ్రెండ్స్‌నే ఇద్దరు మీను వచ్చేసావా వాళ్ళిద్దరూ తనని గట్టిగా హత్తుకుని మేము ఎంత భయపడ్డామో తెలుసా? అసలు డెమోకి రావేమో ఆ లెక్చరర్ అనంతపని చేస్తుందామని మా గుండెలు అదిరిపోయాయే…..
నువ్వు ఎలాగ వచ్చావు కానీ ఇప్పుడు ఎలాగే నువ్వు ఇంతసేపు ఇక్కడ లేవు కదా? ఆ లెక్చరర్ ఇంత లేట్ అయింది అని అడిగితే ఏం చెప్తావు.
ముందే ఆవిడకి నీ మీద కోపం ఇప్పుడూ సడన్‌గా నువ్వు క్లాసులో ప్రత్యక్షం అయితే ఏమంటుందో ఏమో చాలా భయంగా ఉందే అన్నారు మీను ఫ్రెండ్స్ ఇద్దరూ శ్రావణి రోజి…….
ఇది నా ఫస్ట్ స్టోరీ ✍️ఇప్పుడే స్టార్ట్ చేశాను. ముందు ముందు ఈ స్టోరీ చాలా బాగుంటుంది మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. చదివి నన్ను ఫాలో చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ప్లీజ్…..
Swipe left/right or tap the sides to turn pages