New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 1

ఏమండోయ్ మాస్టారు 💞 – 1

ఉదయం తొమ్మిది గంటలు….

 

@@@@@@ డిగ్రీ కాలేజ్ మొత్తం స్టూడెంట్స్‌తో సందడిగా ఉంది.

 

ఎక్కడ చూసినా గ్రూపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న విద్యార్థులు….

 

కొంతమంది క్యాంటీన్ వైపు….

 

మరికొంతమంది క్లాసుల వైపు పరుగులు తీస్తున్నారు….

 

అలాంటి సమయంలో కాలేజ్ గేట్ ముందు ఒక బ్లాక్ కలర్ కారు వచ్చి ఆగింది.

 

కారు డోర్ ఓపెన్ అయ్యింది.

 

ముందుగా ఒక జత బ్లాక్ షు ఒకటి నేల మీద బలంగా పడింది…. స్టూడెంట్స్ అందరూ చూపు ఒక్కసారిగా అటుగా మళ్లీంది…..

 

ఆ తర్వాత….

 

ఆరడుగుల అజానుబాహుడు కారు నుంచి బయటకు దిగాడు….

 

వైట్ షర్ట్….

 

బ్లాక్ ప్యాంట్….

 

చేతిలో వాచ్….

 

మరో చేతిలో కొన్ని ఫైల్స్….

 

అందులో నుంచి ఒక వ్యక్తి స్టైల్గా కిందకి దిగాడు…. మొహంలో ఎలాంటి భావం లేదు, సీరియస్టోన్ మైంటైన్ చేస్తూ కిందకి దిగాడు….

 

అతను గంభీరంగా నడుచుకుంటూ వస్తే అందరి చూపు అతను వైపే ఉంది….

 

అతను అలా నడుచుకుంటూ కాలేజ్ లోపలికి రావడంతో 

 

ఇప్పటివరకు గట్టిగా మాట్లాడుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

 

“అదిగో…. వచ్చేశారు .” అని స్టూడెంట్స్ ఒక్కొక్కరిగా గుసగుసగా మాట్లాడుకుంటారు….

 

“ఎవరు?” ఎవరైనా అని మరి కొంతమంది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ముందుగా తెలిసిన వాళ్ళు 

 

“మన కొత్త లెక్చరర్.” అని చెప్తారు….

 

“అద్వైత్ నందన్ కదా?”

 

“అవును….”  మన అద్వైత్ సార్నే అని కొంతమంది విద్యార్థులు మాట్లాడేసరికి,

 

“చాలా స్ట్రిక్ట్ అంట.” అని మరికొంతమంది మాట్లాడుకుంటారు….

 

“స్ట్రిక్ట్ అయితే పర్లేదు…. చాలా ఆరోగెంట్ అని కూడా విన్నాను.” విద్యార్థులు తమకు నచ్చినట్లుగా అద్వైత గురించి మాట్లాడుకుంటారు…..

 

ఒక అమ్మాయి మెల్లగా స్ట్రిక్  అయితే పర్లేదు కానీ, మాట్లాడుతున్నప్పుడే, ఆమె పక్కన ఉన్న అమ్మాయి వెంటనే నోరు మూసుకోమన్నట్టుగా సైగ చేసింది.

 

ఎందుకంటే….

 

వాళ్ల వెనకే అద్వైత్ నందన్ నిలబడి ఉన్నాడు….

 

“నా గురించి మాట్లాడటం పూర్తయ్యిందా?”

 

అతని గంభీరమైన గొంతు వినగానే ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇద్దరు…

 

“సార్…. మేము….” అని సమాధానం చెప్పేలోపే,

 

“మీరు ఏం మాట్లాడారో నాకు అవసరం లేదు.” అని మాట్లాడుతున్న అద్వైత్ ని ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరు….

 

అతను వాళ్లిద్దరి వైపు చూసి….

 

“కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి.”ఒక్క క్షణం ఆగాడు.

 

“నేను ఎలా ఉంటానో తెలుసుకోవడానికి నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు…. నా క్లాస్‌కి వస్తే చాలు.”

 

అంతే….

 

అక్కడి నుంచి వెళ్లిపోయాడు…. ఇద్దరు ఒక్కసారిగా అతని వెళ్తున్న వైపునే చూస్తూ ఉండిపోతారు…. ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

 

“అబ్బా…. నిజంగానే ఆరోగెంట్.” సార్ కదా అని మాట్లాడుతూ ఉంటే,

 

“అవును…. కానీ….”

 

“కానీ ఏంటి?”

 

“చూడటానికి మాత్రం బాగున్నాడు.”..

 

“నీకు సిగ్గు లేదా?”

 

ఇద్దరూ నవ్వుకున్నారు.

 

అదే సమయంలో….

 

కారిడార్ చివర ఒక అమ్మాయి నిలబడి ఇదంతా చూస్తోంది..,.

 

ఆమె పేరు సహస్ర…

 

ఇరవై ఏళ్ల వయసు…..

 

చాలా అందంగా ఉండే అమ్మాయి ….

 

కానీ ఆమె ముఖంలో ఉన్న అమాయకత్వం మాత్రం చూసినవాళ్లకి వెంటనే నచ్చుతుంది.

 

ఎప్పుడూ తన పని తాను చూసుకుంటూ,

 

ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా ఉండే అమ్మాయి….

 

ఆమె చేతిలో పుస్తకాలు ఉన్నాయి….

 

అద్వైత్ నందన్ వైపు చూస్తూ ఉండిపోయింది….

 

అతని గురించి ఆమెకు కూడా చాలా విషయాలు వినిపించాయి.

 

“చాలా కోపం.”

 

“ఎవరినీ లెక్క చేయడు.”

 

“తన మాటే వినాలి అంటాడు.”

 

“అసలు నవ్వడు.”

 

కానీ….

 

ఎందుకో అతన్ని మొదటిసారి చూసిన క్షణంలోనే సహస్రకు భయం కలగలేదు…

 

అతని కళ్లల్లో ఏదో తెలియని బాధ కనిపించింది….

 

అది ఆమెకు ఎందుకో అర్థం కాలేదు… అదేంటి నాకు అలా అనిపిస్తుంది అని ఆలోచనలో పడుతుంది సహస్త్ర….

 

“సహస్ర….”

 

పక్క నుంచి ఆమె స్నేహితురాలు పిలవడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది…

 

“ఏంటి?”

 

“ఎక్కడ చూస్తున్నావ్?”

 

“ఏం లేదు.”

 

“అద్వైత్ సార్‌నే కదా?”

 

సహస్ర వెంటనే తల తిప్పేసింది.

 

“ఛ…. నేను ఎందుకు చూస్తాను?”

 

“అవునా?”

 

“అవును.”అని చెప్పి క్లాస్‌లోకి వెళ్లిపోయింది.

 

కానీ….

 

ఆమె మనసులో మాత్రం అతని చుట్టూ తిరుగుతోంది…. ఎందుకు అలా ఆలోచిస్తుందో తనకే అర్థం కాదు….

 

మొదటి క్లాస్….

 

అద్వైత్ నందన్ క్లాస్‌లోకి అడుగుపెట్టగానే మొత్తం క్లాస్ సైలెంట్ అయిపోయింది….

 

అతను టేబుల్‌పై ఫైల్స్ పెట్టి స్టూడెంట్స్ అందరినీ ఒక్కసారి చూశాడు.

 

“గుడ్ మార్నింగ్.” అని విష్ చేసేసరికి,

 

అందరూ ఒకేసారి….

 

“గుడ్ మార్నింగ్ సార్.”అన్నారు….

 

అతను బోర్డు మీద తన పేరు రాశాడు.

 

అద్వైత్ నందన్.

 

“నేను మీకు ఈ సెమిస్టర్ మొత్తం క్లాసులు తీసుకుంటాను…”

 

అందరూ అతని వైపు చూస్తున్నారు…

 

“నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి….” ఫాలో అయితే మీరు ప్రశాంతంగా ఉంటారు నేను ప్రశాంతంగా ఉంటాను…. లేదు అంటే నా స్టైల్ లో నేను మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని కార్నర్స్ స్మైల్ తో మాట్లాడతాడు. అద్వైత్….

 

అతను మార్కర్‌ను టేబుల్ మీద పెట్టాడు….

 

“నా క్లాస్‌లో టైమ్‌కి రావాలి.”…

 

“క్లాస్‌లో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి.”…

 

“నేను చెప్పే విషయం అర్థం కాకపోతే అడగండి…. కానీ క్లాస్‌ని డిస్టర్బ్ చేస్తే మాత్రం సహించను.”

 

అంతే….

 

ఒక అబ్బాయి వెనక నుంచి మెల్లగా నవ్వాడు….

 

అద్వైత్ వెంటనే అతని వైపు చూసి పైకి లే అని కోపంగా మాట్లాడతాడు….

 

“నువ్వు.”

 

ఆ అబ్బాయి లేచి “సార్?” అని మాట్లాడే లోపే,

 

“ఏం నవ్వుతున్నావ్?” నవ్వొచ్చే అంత సిచువేషన్ ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు….

 

“ఏం లేదు సార్.” అని కాస్త కంగారుపడుతూ మాట్లాడతాడా అబ్బాయి….

 

“నేను ప్రశ్న అడిగినప్పుడు ‘ఏం లేదు’ అనేది ఆన్సర్ కాదు.” ఏం లేనప్పుడు ఎందుకు నవ్వుతున్నావ్ అని కోపంగా అడుగుతాడు….

 

సైలెంట్ అయినా అబ్బాయి వంక చూస్తు, పిచ్చిపిచ్చిగా నవ్వడం పిచ్చి పనులు చేస్తే మాత్రం దవడలు పగులుతాయని వార్నింగ్ ఇస్తాడు….

 

“కూర్చో.” అని సీరియస్ గా చెప్పేసరికి,

 

ఆ అబ్బాయి వెంటనే కూర్చున్నాడు.

 

అద్వైత్ క్లాస్ మొదలుపెట్టాడు….

 

సహస్ర మాత్రం అతని మాటలను శ్రద్ధగా వింటోంది…..

 

అతను చెప్పే ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటోంది…..

 

క్లాస్ చివర్లో….

 

“ఏమైనా డౌట్స్ ఉన్నాయా?” అని అద్వైత్ అడిగేసరికి,

 

అందరూ మౌనంగా ఉన్నారు…. అందరూ ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు నాకు మీ క్లాస్ అర్థమైందా లేదో చెప్పాలి కదా అని సీరియస్ అవుతాడు….

 

సహస్ర మాత్రం నెమ్మదిగా చేయి ఎత్తింది.

 

అద్వైత్ ఆమె వైపు చూశాడు.

 

“చెప్పు.”

 

ఆమె లేచి తన డౌట్ అడిగింది.

 

అతను కొన్ని సెకన్లు ఆమె వైపు చూసి….

 

“గుడ్.” అన్నాడు….

 

“ఎందుకో ?”సహస్రకి అర్థం కాలేదు….

 

“అందరూ అర్థం కాకపోయినా అడగడానికి భయపడుతున్నారు. నువ్వైనా అడిగావు.”

 

ఆమె చిన్నగా నవ్వింది…”థ్యాంక్యూ సార్.”

 

అద్వైత్ మళ్లీ బోర్డు వైపు తిరిగిపోయాడు…. ఆమె అడిగిన డౌట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాడు… కొంచెం సమయానికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు అర్థమైందా అని అడుగుతాడు అద్వైత్…..

 

అతనికి అది చిన్న విషయం.

 

కానీ….

 

సహస్రకి మాత్రం ఆ రోజు మొత్తం గుర్తుండిపోయింది…..

 

రోజులు గడుస్తూ ఉండగా…..

 

అద్వైత్ నందన్ గురించి సహస్రకి ఒక విషయం మాత్రం అర్థమైంది….

 

అతను ఆరోగెంట్….

 

కానీ అన్యాయం చేయడు.

 

ఎవరైనా తప్పు చేస్తే వాళ్ల స్థాయి చూడకుండా ప్రశ్నిస్తాడు…..

 

ఎవరైనా కష్టపడుతుంటే మాత్రం ఎవరికీ తెలియకుండా సహాయం చేస్తాడు….

 

ఒకరోజు కాలేజ్‌లో సహస్ర ఫీజు విషయంలో సమస్య వచ్చింది…..

 

ఆమె ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడి ఉంది…..

 

సహస్ర కన్నీళ్ళతో “మేడమ్…. ఇంకొన్ని రోజులు టైమ్ ఇవ్వండి.”….

 

“సహస్ర, మేమేం చేయగలం? ఫీజు కట్టాలి.”….

 

అప్పుడే వెనక నుంచి అద్వైత్ వచ్చాడు…..

 

“ఏం జరిగింది?” అని అడిగేసరికి,

 

సహస్ర ఏమీ మాట్లాడలేదు…..

 

ఆమె పరిస్థితిని గమనించిన అతను, ఆఫీస్‌లో ఉన్న వ్యక్తిని చూసి….

 

“ఆమె ఫీజు గురించి నాతో మాట్లాడండి….” అని అటువైపు మాట్లాడేసరికి 

 

“సార్….”

 

“నేను చెప్పింది అర్థం కాలేదా?”

 

అతని గొంతులోని గంభీర్యానికి ఎదుటి వ్యక్తి సైలెంట్ అయ్యాడు…. 

 

సహస్ర అతని వైపు ఆశ్చర్యంగా చూసింది…..

 

“సార్…. నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు.” అని చిన్నగా మాట్లాడింది…

 

అతను ఆమె వైపు తిరిగి చూశాడు….

 

“నిన్ను ఎవరు అడిగారు?” అద్వైత్ అడిగేసరికి,

 

“అంటే….” అని నసుకుతున్న ఆమెను చూసి,

 

“చదువుకోవాలనుకునే వ్యక్తికి డబ్బు అడ్డంకి కాకూడదు….”

అంతే చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు…

 

సహస్ర కళ్లల్లో నీళ్లు తిరిగాయి….

 

ఆ రోజు మొదటిసారి అద్వైత్ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది…. గౌరవంతో కూడిన అభిమానం ఏర్పడింది ఆమెకు….

 

ఆమెకు అద్వైత్ నందన్ మీద గౌరవం కలిగింది.

 

ఆ గౌరవం….

 

ఎప్పుడు ప్రేమగా మారిందో మాత్రం ఆమెకే తెలియలేదు….

 

కానీ….

 

అద్వైత్ నందన్ మాత్రం తన మనసులో అలాంటి ఆలోచనకు చోటివ్వలేదు….. అతని మనసులో కూడా ఆమె గురించి ఏ చిన్న ఆలోచన లేదు… ఒక స్టూడెంట్ గా మాత్రమే తనకి ఫీజు కట్టాలి అని డిసైడ్ అవుతాడు….

 

ఎందుకంటే సహస్ర అతని స్టూడెంట్.

 

ఆమెపై తనకున్నది బాధ్యత మాత్రమే అని,అతను తనను తాను నమ్మించుకున్నాడు…. బాధ్యత అంటే ఎలాంటి బాధ్యత అనేది అతనికి మాత్రమే తెలుసు….

 

అయితే….

 

ఒకరోజు సహస్ర జీవితంలో జరిగిన ఒక సంఘటన అతని ఆలోచనలన్నింటినీ మార్చబోతోంది…..

 

ఆమెను కాలేజ్ నుంచి దూరం చేయాలని ఆమె కుటుంబం తీసుకున్న నిర్ణయం…. అతన్ని ఏరకంగా బాధపెట్టబోతుంది?? లేకపోతే అతని జీవితాన్నే పూర్తిగా మార్చబోతుందా అనేది ఆ పైవాడికే తెలియాలి….

 

అద్వైత్ నందన్ ముందు ఒక పెద్ద ప్రశ్నగా ఆమె జీవితం ఉండబోతుందా?? అద్వైత్ సహస్ర జీవితంలోకి రావడంతో ఆమె జీవితం సంతోషంగా మారుతుందా లేదా అనేది ముందు ముందు చూద్దాం??

 

                 మీ chinni♥️