New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 2

ఏమండోయ్ మాస్టారు 💞 – 2

అద్వైత్ నందన్ ముందు ఒక పెద్ద ప్రశ్నగా ఆమె జీవితం ఉండబోతుందా?? అద్వైత్ సహస్ర జీవితంలోకి రావడంతో ఆమె జీవితం సంతోషంగా మారుతుందా లేదా అనేది ముందు ముందు చూద్దాం??

 

నెక్స్ట్ డే….

 

కాలేజీ లోకి సహస్ర అడుగుపెట్టగానే ఆమె మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతుంది….

 

రోజు తనని చూసి నవ్వే ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఆమెను అదో మాదిరి చూస్తూ ఉంటారు…

 

ఏం జరిగిందో అర్థం కాక తన క్లాసులోకి వెళ్లి కూర్చుంటుంది సహస్ర….

 

అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ అయినా నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చి, సహస్ర అని పిలిచింది…

 

ఏంటి అని సహస్ర అడిగేసరికి, 

 

నిన్న మీ ఇంట్లో ఏం జరిగింది అని కోపంగా అడుగుతుంది నిహారిక….

 

సహస్ర ఆ మాట వినగానే ఆమె మొహం ఒక్కసారిగా మారిపోయింది…. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని బాధ నిహారిక కనిపించింది…

 

ఏంటే నేను మాట్లాడుతున్న సరే మౌనంగా ఉన్నావు అని కోపంగా నిహారిక అడిగేసరికి,

 

అది ఇంట్లో వాళ్ళు అని మాట్లాడుతున్నప్పుడే, అయినా ఈ విషయం నీకు ఎలా తెలుసు అని సీరియస్గా అడుగుతుంది సహస్త్ర….

 

మీ అన్నయ్య కాలేజ్ కి వచ్చారంట,ప్రిన్సిపల్ సార్ తో కూడా ఏదో మాట్లాడారని తెలిసింది…

 

సహస్ర ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది….

 

చెప్పవే ఇప్పుడైనా అని కోపంగా నిహారిక అడిగేసరికి,

 

ఏం లేదు అని మాట దాటేస్తుంది సహస్త్ర….

 

ఏది అదే మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు అని కోపంగా నిహారిక అడిగేసరికి,

 

సహస్ర కన్నీళ్ళతో ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నిహారిక అని ఏడుపు గొంతుతో మాట్లాడుతుంది….

 

ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది నిహారిక….

 

మరి నీ చదువు సంగతి ఏంటి అని సీరియస్గా నిహారిక అడిగేసరికి, అసలు నిన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని కోపంగా అడుగుతుంది నిహారిక….

 

అయినా చదువు పూర్తి కాకుండా, అప్పుడే పెళ్లి ఏంటి అని బాధగా అడిగేసరికి,

 

నేను అదే మాట చెప్తున్నాను కానీ,ఇంట్లో ఎవరు నా మాట వినటం గానీ  నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడ్చేస్తుంది సహస్ర….

 

ఈ పేరెంట్స్ అంతా ఇంతే కదా పిల్లల్ని అసలు అర్థం చేసుకోరు అని కోపంగా అరుస్తుంది నిహారిక….

 

ఒక విషయం చెప్పు సహస్ర అని ఆమె భుజం మీద చేయి వేసి, ఇంతకీ నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా అని కాస్త కంగారుగా అడుగుతుంది….

 

నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏంటే మౌనంగా ఉన్నావు అని సీరియస్ అవుతుంది నిహారిక….

 

నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని తల అడ్డంగ ఊపుతుంది సహస్త్ర….

 

ఇదే మాట మీ పేరెంట్స్ తో చెప్పొచ్చు కదా గట్టిగా అని నిహారిక అడిగేసరికి,

 

వాళ్లు వింటే నాకెందుకు ఈ బాధ అని కన్నీళ్లు పెట్టుకుంటూ రెండు చేతులతో మొహాన్ని ఒప్పుకుంటుంది సహస్త్ర….

 

సహస్ర అలా ఏడుస్తున్నప్పుడే క్లాస్ రూమ్ బయట నిలబడి ఉన్న అద్వైత్ కి ఆ మాటలు వినిపిస్తాయి….

 

అతని లోపలికి వచ్చి చూసేసరికి నిహారిక సైలెంట్ అయిపోతుంది….

 

ఏం జరుగుతుంది ఇక్కడ అని అద్వైత్ సీరియస్ స్టోన్ లో అడిగేసరికి,

 

సార్ అది అది అని నాన్చుతున్న నిహారిక అని కోపంగా తనకి ఒక లుక్ ఇస్తాడు అద్వైత్…

 

అద్వైత ఏడుస్తున్న సహస్ర వైపు చూసి, నేను అడిగింది వినిపించట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అని మళ్ళీ సీరియస్గా అడుగుతాడు….

 

సహస్రా కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా సార్ నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు అని ఏడుపు గొంతుతో మాట్లాడుతుంది….

 

అతడు పేస్ లో ఏ భావం చూపించకుండా, కోపంగా రెండు చేతులు పిడికిలి బిగించి తన కోపాన్ని తాను అంచుకునే పనిలో పడతాడు…..

 

నీకు ఇంతకీ పెళ్లి ఇష్టమేనా అని అద్వైత అడిగేసరికి, సహస తల అడ్డంగా ఊపుతుంది…. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్ అని ఏడుపు గొంతుతో సమాధానం చెబుతుంది….

 

ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్ తో కూర్చుని వాళ్ళని నెమ్మదిగా ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా అని అతని వాయిస్ స్లో లో చెప్పేసరికి,

 

వాళ్లు నా మాట వినే స్టేజ్లో లేరు సార్ అని బాధగా మాట్లాడుతుంది….

 

అద్వైత్ కొంచెం సేపు ఆలోచనలో పడతాడు…. మరి నీ చదువు సంగతి ఏంటి అని అతని ప్రశ్నించేసరికి,

 

నిండుకుండలా ఉన్న ఆమె కళ్ళు మళ్లీ వర్షించడం మొదలుపెడతాయి….

 

తెలీదు సార్ అని చిన్నగా ఆమె మాట్లాడే సరికి,

 

మరి చదువు ఆపేస్తే నీ భవిష్యత్తు ఏంటి అని సీరియస్గా అడుగుతాడు…

 

ఇది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం నువ్వు తీసుకునే నిర్ణయం నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది సహస్త్ర అని సీరియస్ గా అతని గొంతు వినిపిస్తుంది…..

 

మీరు చెప్పింది నిజమే సార్ కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేను కదా అని ఏడుస్తుంది….

 

అద్వైత ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, ముందు నువ్వు భయపడడం మానుకో అప్పుడే నీ మనసు చెప్పన దాని గురించి ఆలోచించుకో అని చెప్తాడు….

 

ఆ మాటలు ఆమె మెదడులో బలంగా నాటుకు పోతాయి….

క్లాస్ తీసుకొని అతను వెళ్లిన దగ్గర నుండి అద్వైత్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడాలని డిసైడ్ అవుతుంది . సహస్త్ర….

 

ఈవినింగ్…

 

అద్వైత తన క్యాబిన్లో కూర్చుని పేపర్లు చెక్ చేస్తూ ఉంటాడు..

 

కానీ అతను మనసు మొత్తం సహస్త్ర చుట్టూ తిరుగుతుంది….

 

సహత్ర చెప్పిన మాటలే అతని బుర్రలో తిరుగుతూ ఉంటాయి…. నన్ను చదివా ఆపేయమంటున్నారు సార్ అన్న మాట అతని చెవిలో రీ సౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది….

 

ఇది సహస్ర జీవితం…. ఎవరి ఇష్టం ల కోసం తన ఇష్టాల్ని చంపుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తాడు….

 

అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది…

 

కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అటువైపు చెప్పిన వ్యక్తి విషయం విని గురించి ఒక్కసారిగా అతని ఫేస్ మారిపోతుంది….

 

కరెక్ట్ గానే చెప్తున్నావా మళ్లీ అవతలి వ్యక్తి ఏదో చెప్పాడు…. కొంచెం సేపు ఆలోచనలో పడిపోతాడు అద్వైత్….

 

కుర్చీలో నుంచి పైకి లేచి అక్కడినుండి వెళ్ళిపోతాడు…..

 

నెక్స్ట్ డే ….

 

సహస్ర కాలేజ్ కి రాలేదు…. మధ్యాహ్నం దాకా ఎదురుచూసిన అద్వైత్ కి ఆమె ఇంకా కాలేజీకి రాదు అని అర్థమవుతుంది….

 

రూమ్ లో నుంచి బయటకు వచ్చిన అద్వైత ఎందుకు సహస్త్ర  కాలేజ్ రాలేదు అని ఆమె స్నేహితులని అడుగుతాడు…

 

ఎవరు సమాధానం చెప్పకపోయేసరికి వెంటనే ఫోన్ తీసుకొని ఆమె నెంబర్ కి కాల్ చేశాడు…. ఇంతకుముందు రిజిస్టర్ లో తన నెంబర్ నోట్ చేసుకున్న అతను వెంటనే కాల్ చేసేసరికి స్విచ్ ఆఫ్ అని వస్తుంది….

 

ఎన్నిసార్లు ట్రై చేసినా గాని స్విచ్ ఆఫ్ రావడంతో అతనిలో అనుమానం మొదలవుతుంది….. సాయంత్రం వరకు ఎదురుచూసిన అతను బయటకు వస్తూ ఉండగా,

 

కాలేజ్ బయట ఒక కారు ఆగి కనిపిస్తుంది…. ఆ కారులో నుంచి ఒక వ్యక్తి కిందకి దిగాడు….

 

అతన్ని చూసిన అద్వైత్ ఒక నిమిషం ఆగిపోయాడు… ఆ వ్యక్తి ఎవరో కాదు సహస్రాన్ని పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి…

 

అతను అద్వైత దగ్గరికి వచ్చి మీరు అద్వైత్ సార్ కదా అని అడుగుతాడు….

 

అవును అని సమాధానం చెప్పేసరికి

 

నేను అర్జున్…సహస్రకి కాబోయే భర్తని అని పరిచయం చేసుకుంటాడు…..

 

అద్వైత్ అతన్ని కింద నుండి పై దాకా ఒకసారి చూశాడు…. ఏం కావాలి మీకు అని అడిగేసరికి,

 

అర్జున్ చిన్నగా స్మైల్ చేస్తూ మీరు మా పెళ్లి విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఉన్నారు,

 

అద్వైత్ నార్మల్గానే ఎవరు చెప్పారు మీకు అలా అని అడుగుతాడు….

 

అర్జున్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడేసరికి,

 

అయితే నాకు కూడా నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని తిరిగి చెప్తాడు అద్వైత్….

 

అర్జున్ కోపంగా చూస్తూ మీరు లెక్చలేర్ మీ పని చదువు చెప్పడం మాత్రమే, మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదు అని సీరియస్ గా మాట్లాడుతాడు….

 

అద్వైత ఒక్క అడుగు ముందుకు వేసి నువ్వు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకో, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే ఆమెను నీ ఆస్తిగా భావించడం కాదు….

 

అర్జున్ కోపంగా మీకు సహస్త్ర  మీద అంత కేర్ ఎందుకు అని సీరియస్ అవుతాడు….

 

అద్వైత ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత కోపంగా ఎందుకంటే ఆమెను స్టూడెంట్ అని చెప్తాడు….

 

అంతేనా అని అర్జున్ వంకరగా నవ్వుతూ అడిగేసరికి,

 

అద్వైత అతని కళ్ళల్లోకి చూస్తూ నా గురించి తెలుసుకోవాలని ఆసక్తి నీకు చాలా ఉన్నట్లుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు….

 

రాత్రి సహస్రా తన గదిలో కూర్చుని ఏడుస్తుంది…. ఆమె ముందు పెళ్లి పట్టు చీర, పక్కనే నగలు,టేబుల్ మీద పెళ్లి కార్డు అన్ని సిద్ధంగా ఉన్నాయి….

 

కానీ ఆమె మనసు మాత్రం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించట్లేదు….. ఒక్కసారిగా ఆమె ఫోన్ ఆన్ చేసి చూసేసరికి ఎన్నో మెసేజ్లు కనిపిస్తాయి…..

 

రేపు ఉదయం కాలేజీకి రా నీతో మాట్లాడాలి అని సెండ్ చేసిన అద్వైత్ నందన్ మెసేజ్ చూసి సహస్ర కళ్ళల్లో నీళ్లు కారాయి….

 

తెలియకుండానే ఆమె పెదవుల పైన చిరునవ్వు వచ్చి చేరుతుంది….

 

సార్ మీరు నా కోసం ఏం చేయబోతున్నారు అని నెమ్మదిగా అనుకుంటూనే, ఈ పెళ్లి ఆగిపోతే బాగుండు అని మనసులో దేవుడిని ప్రార్థిస్తుంది….

నెక్స్ట్ డే మార్నింగ్….

 

సహస్ర నార్మల్గానే రెడీ అయ్యి కాలేజీకి వచ్చింది…. అప్పటివరకు ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఆమె ఈరోజు సార్ ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తూ కాలేజీలోకి ఎంటర్ అవుతుంది  …

 

           మీ chinni ♥️