అతను అప్పటికే మరో నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం సహస్ర జీవితంలో కొత్త సమస్యను తీసుకురాబోతోంది.
కానీ ఈసారి…. భయపడి మౌనంగా ఉండే పాత సహస్ర కాదు. తన కోసం తాను మాట్లాడడం నేర్చుకున్న కొత్త సహస్ర….
నెక్స్ట్ డే….
ఉదయం…. సహస్ర చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా కాలేజ్‌కి బయలుదేరింది…..ఇంట్లో కూడా నిన్న జరిగిన విషయం తర్వాత ఎవ్వరూ ఆమెతో పెళ్లి గురించి మాట్లాడలేదు…..తన చదువు కొనసాగించడానికి తండ్రి ఒప్పుకున్న విషయం ఆమె మనసులో చిన్న ఆనందాన్ని నింపింది…..
కాలేజ్‌లోకి అడుగుపెట్టగానే నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చింది……
“ఏంటే…. ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావ్?” అని అడిగింది…