ఏవండోయ్ మాస్టారు 💞 19
ఆ రోజు…. వాళ్లిద్దరికీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది….. ఇప్పటివరకు ఒక టీచర్…. ఒక స్టూడెంట్…. అనే పరిచయం ఇప్పుడు మరింత ప్రత్యేకమైన అనుబంధంగా మారుతోంది….. కానీ…. వాళ్లు ఇద్దరూ ఆ అనుబంధానికి ఇంకా ఒక పేరు పెట్టలేదు…..
ఆ రోజు…. క్లాస్ మొత్తం సహస్ర వైపు చూస్తూనే ఉంది. “గుడ్ మార్నింగ్ ఏవండోయ్ మాస్టారు….” అనే మాట ఇంకా అందరి చెవుల్లోనే ఉంది…..
సహస్ర మాత్రం తల దించుకుని నోట్స్ రాసుకుంటున్నట్టు నటిస్తోంది….
పక్కనే కూర్చున్న నిహారిక ఆమెని చూస్తూ నవ్వు ఆపుకోలేకపోతోంది…..
“ఏంటే….” అని నెమ్మదిగా అడిగింది…..