ఈ విషయం రోజు మాకు చెప్పడం కాదమ్మా వెళ్లి వాడికి చెప్పు… ఇచ్చిన విలువని కాపాడుకోమ్మని అని కోపంగా చెప్పింది శాన్వి…
చూడు శాను! మీ పిలుపే మా పెంపకాన్ని ప్రశ్నిస్తుంది అతడితోనే కాపురం చేస్తూ మీ అక్క వాళ్ళింట్లోనే ఉంటున్నప్పుడు అతడికి మర్యాద ఇవ్వకపోతే ఆ కోపం మీ అక్క మీద చూపిస్తాడు…
మీ అక్క మంచి కోరుకునే దానివి అయితే అతడితో ఎలాంటి గొడవలు పెట్టుకోకు నీకు క్రితం సారే చెప్పాను.. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకుండా పెట్టుకొని తినండి.. నేను మీ నాన్న గారికి భోజనం పెడతాను అన్నారు..
హ్మ్ అని ఇద్దరు భోజనం ముగించి గదిలోకి వెళ్లారు…